*కాంగ్రెస్ మాయ మాటలను నమ్మితే మోసపోయినట్టే*
*అంజన్న గెలుపుని ఎవ్వరు ఆపలేరు*
*ఇంటింటి ప్రచారానికి జననిరాజనం*
*మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్…..*
ప్రజా గొంతుక న్యూస్ :షాద్ నగర్
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను నమ్మితే మోసపోతారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ 13,14వ వార్డులలో కౌన్సిలర్లు కానుగు అనంతయ్య, బచ్చలి నర్సింహా ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం మమ్మరంగా నిర్వహించారు.ఈ ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ మాట్లాడుతూ
షాద్ నగర్ ను మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ గెలుపును ఎవరు ఆపలేరని, ఎమ్మెల్యే గా మూడోసారి ముచ్చటగా గెలవబోతున్నారు ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీలో ఎక్కడికి వెళ్లిన జననిరాజనం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. బిఆర్ఆర్ కార్యకర్తలంతా అంజన్న గెలుపు కొరకు ఉత్సాహంతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు.ఈ ప్రచారంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్స్, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.…..