తనలాగా నియోజకవర్గంలో సేవ చేసిన ఘనత ఎవ్వరికీ లేదు
ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఇప్పటికిప్పుడు 40 వేల ఓట్లు వచ్చే అవకాశం.
ప్రజలు ఆలోచిస్తున్నందునే ఆశీర్వదిస్తారు.
బీసీ నాయకుడు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు
ప్రజా గొంతుక న్యూస్/ సూర్యాపేట జిల్లా ఆగస్టు28
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్
అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు బీసీ నాయకుడు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు ఓజో ఫౌండేషన్ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్బంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో వెల్లడించారు. పిసిసి ఏర్పాటు చేసిన ఎన్నికల సెలక్షన్ కమిటీకి తాను ధరఖాస్తు చేసినట్లు బి.ఫామ్ వస్తే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తానని, నియోజకవర్గంలో తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని ఆశాభావం చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయిన నాయకులు,బలంగా ఉన్నామని చెప్పుకోవడానికే తప్పా గ్రౌండ్ లెవెల్ వారికి బలం లేదని
బిసి ని అయిన తనను సైడ్ చేసేందుకు 50,000 మెజార్టీ అని డప్పులు కొడుతున్నారని, గతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా అధికార పార్టీలలో ఉన్నప్పుడే 50వేల మెజారిటీ రాలేదని ఇప్పుడెలా వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఇప్పటికిప్పుడు 40 వేల ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని ఈ మూడు నెలల కాలంలో లక్షకు పైగా ఓట్లు తనకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
తనలాంటి బీసీ నాయకునికి ఒక్కసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని గత మూడేళ్లుగా నియోజకవర్గంలో ఓజో ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించినామని నేటి వరకు ఏ రాజకీయ నాయకుడు తన లాగా నియోజకవర్గంలో సేవ చేసిన ఘనత ఎవ్వరికీ లేదని ప్రజలు ఆలోచిస్తున్నందునే ఆశీర్వదిస్తారన్నారు.