గాంధీజీ 154వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎస్పీ
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పి డా.వినీత్.జి ఐపిఎస్ మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో ఓ సామాన్య మానవునిగా పుట్టిన మహాత్మ గాంధీజీ తెల్ల దొరలను శాంతి,అహింసా అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు ఎన్నో పోరాటాలు చేశారని,ఆ సమయంలో యావత్ భారతావని ఆయన శాంతియుత పోరాటానికి మద్దతు పలికిందని.అలాంటి మహోన్నత వ్యక్తికి స్వాతంత్య్రం రాకముందు ఎన్నో అవమానాలు.ఎదురయ్యాయని,వాటన్నింటనీ అధిగమించి గాంధీజీ ఓ వ్యక్తి నుండి మహాశక్తిలా మారారు. గాంధీజీ ఎంచుకున్న శాంతి,అహింసా మార్గం భారతీయులకే కాదు మొత్తం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందిని అన్నారు.
మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలి.
త్రుప్పు పట్టిన సిద్ధాంతాలను పాటిస్తూ హింసా మార్గాన్ని ఎంచుకుని అమాయక ఆదివాసీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ,అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టులు కూడా మహాత్మా గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని,ఆయన సిద్ధాంతాలైన సత్యం,శాంతి,అహింసా మార్గాలలో నడుచుకోవాలని సూచించారు.ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.ఇతర దేశాలలో హింసా మార్గంలో నడిచిన వ్యక్తుల సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని మావోయిస్టులు ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ . టి.సాయి మనోహర్,చుంచుపల్లి సిఐ పెద్దన్న కుమార్,డిసిఆర్బి సిఐ వెంకటేశ్వర్లు,ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు,రాజువర్మ,ఆర్ఐలు సుధాకర్,కృష్ణారావు,నాగేశ్వరరావు మరియు ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.