మళ్లీ కెసిఆర్ మన సీఎం పల్లా గెలుపే మన లక్ష్యం..!
ప్రచార హోరులో బిఆర్ఎస్ శ్రేణులు
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పలు గ్రామాల్లో పల్లా గెలుపే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.
అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరిన్ని సంక్షేమ పథకాలు ను అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నింపుతుందని అన్నారు. ఏ ఇంటికి వెళ్లిన ఘన స్వాగతాలు పలుకుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి ,వైస్ ఎంపీపీ కల్లూరు అనిల్ రెడ్డి, ఎంపిటిసిలపోరం మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్, సర్పంచులు వడ్డేపల్లి మల్లారెడ్డి, భవాని శశిధర్ రెడ్డి ,పర్వతం మధు ప్రసాద్ ,యూత్ మండల అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గంధమల్ల నరేందర్, ఐవిఎఫ్ జిల్లా యూత్ అధ్యక్షుడు జిల్లా సందీప్ ,పలు గ్రామాల శాఖ అధ్యక్షులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.