దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ ప్రభుత్వమే
— గంపగుత్తగా పల్లాకే మా ఓట్లు
–– బేడ బుడగ జంగాల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ చింతల యాదగిరి (గిరి)
ప్రజాగొంతుక న్యూస్/ బచ్చన్నపేట:
దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ ప్రభుత్వమే అనిబేడ బుడగ జంగాల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ చింతల యాదగిరి (గిరి) అన్నారు.బచ్చన్నపేట మండల కేంద్రంలో పల్లా గెలుపు కోసం
బేడ బుడగ జంగాల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ చింతల యాదగిరి (గిరి) బేడ బుడగజంగాలను ఐక్యత చేస్తూ,వారిని ఉత్తేజపరుస్తూ ప్రతి ఒక్కరూ పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపుకు ఒక్కొక్కరు ఒక సైనికుని వలె కష్టపడి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.
ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులను పట్టించుకునే నాధుడే లేడని,ఈనాడు దళిత కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని అన్నారు.పల్లా గెలుపు కోసం నియోజకవర్గంలో విస్తృత సమావేశాలు ఏర్పాటు చేస్తామని బేడ బుడగ జంగాల ఓట్లు ఐక్యంగా గంప గుత్తగా నియోజకవర్గ బారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికే ఓట్లు వేసి గెలిపిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బేడ బుడగ జంగాల మండల అధ్యక్షుడు సిరిపాటి రామదాసు,కుల పెద్దమనిషి తూర్పాటి యాదగిరి,యూత్ జిల్లా అధ్యక్షుడు చింతల కరుణాకర్,సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు చింతల మధుకృష్ణ,ఉప్పలయ్య, విజయ్,చింతల లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.