విశ్వకర్మ నాయకుల ఆధ్వర్యం లో మోడి కి పాలాభిషేకం
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
విశ్వ కర్మ 18 చేతివృత్తి దారులకి బాసటగా ఈరోజు పియం విశ్వకర్మ యోజన పధకం ప్రారంబించినందుకు ఆదివారం చర్లలో విశ్వకర్మ నాయకులు ముత్తారం రత్తయ్య ఆద్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడి చిట్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది..ఈ సందర్భం గా రత్తయ్య విశ్వకర్మ యోజన పధకం గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో పలవోజు సుదర్శన చారి,సంతపురి సురేశ్,రాచకొండ అనిల్,సాధం లొకనాధం,వెంకటేశ్వర రావు, సోమ రాజు,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.