బచ్చన్నపేట బిఆర్ఎస్ పార్టీ ఆఫీసును సందర్శించిన పల్లా
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో పార్టీ ఆఫీసుకు నూతన రంగులు , నూతన మెరుగులు తో ఏర్పాటు అవుతున్న పార్టీ ఆఫీసును జనగామ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు.
కార్యకర్తల కోసం నాయకుల కోసం ప్రజల కోసం ఏర్పాటు అవుతున్న ఆఫీసులో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, మండల అధ్యక్షుడు బోడిగం చంద్రారెడ్డి, కో ఆప్షన్ నెంబర్ షబ్బీర్ పట్టణ అధ్యక్షుడు గంధ మల్ల నరేందర్, యూత్ మండల అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్రెడ్డి, ఐ వి ఎఫ్ జిల్లా యూత్ అధ్యక్షుడు జిల్లా సందీప్, పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్, కట్కూరు సర్పంచ్ సునీత రాజు గౌడ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు