రసాయన శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన సర్వారం వాసి పాలూరి అంజయ్య
అభినందనలు తెలిపిన సర్వారం గ్రామ ప్రజలు, ప్రముఖులు
ప్రజా గొంతుక న్యూస్/హుజూర్ నగర్
గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన పాలూరి జోగమ్మ- రాజయ్య కుమారుడైన పాలూరి అంజయ్యకి రసాయన శాస్త్రంలో సిల్వర్, గోల్డ్ మరియు పెల్లాడియం నానో మెటీరియల్స్ పై ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ ఆధ్వర్యంలో చేసిన పరిశోధనలకు గాను ఉస్మానియా యూనివర్సిటి డాక్టరేట్ ప్రధానం చేసింది.
వీరు సర్వారం గ్రామం కాగా లింగగిరి లో విద్యను పూర్తి చేసి ఇంటర్ డిగ్రీ హుజూర్ నగర్ చైతన్య కాలేజీలో పీజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేయడం జరిగింది వీరు గత 15 సంవత్సరాల నుండి హైదరాబాదులో శ్రీ ఇందు ఇంజనీరింగ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు
ప్రస్తుతం నారాయణ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన సోదరులు సన్నిహితులు కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సర్వారం గ్రామ ప్రజలు అంజయ్యకు అభినందనలు తెలిపారు