*షాద్ నగర్ నియోజక వర్గ ప్రజలారా మేధావులారా నాయకుల్లారా ఒక్కసారి ఆలోచించండి….*
*షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నూతన ఉద్యమ నాయకత్వమే ఏకైక మార్గం.*
ప్రజా గొంతుక న్యూస్ :రంగా రెడ్డి జిల్లా ప్రతినిధి
*ఇప్పటి వరకు ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలకు మళ్ళీ ఓట్లు వెస్తే అధికారం అడ్డుపెట్టుకొని వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు తప్ప ప్రజల ఆర్థిక, సామజిక, రాజకీయ అభివృద్ధికి కృషి చేయరు*
*9 ఏళ్ల సభలో ఎమ్మెల్యే గా కనీసం ఐదు ప్రధాన సమస్యలపై, ఐదు నిమిషాలు మాట్లాడని, వారిని మళ్ళీ చట్టసభకు పంపితే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.*
*షాద్నగర్ నియోజకవర్గం ప్రజలారా మన ఓటు, మన ఇష్టం. ఆలోచించి వేసుకుందాం షాద్ నగర్ అభివృద్ధి చేసుకుందాం..*
*మార్పు కోసం….*
*నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో షాద్ నగర్ నియోజక వర్గానికి ఇప్పటి వరకు….*
*1) లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు హామి ఉసే లేదు.*
*2) షాద్నగర్ రైల్వే బ్రిడ్జి తీరేది ఎన్నడూ..*
*3) 100 పడకల ఆసుపత్రి పూర్తి కాలేదు.*
*4) షాద్ నగర్ నియోజవర్గం విద్య వ్యవస్థకు మౌలిక వసతులు తీరలేదు.*
*5) తండాలకు రోడ్లు లేవు.*
*6) షాద్ నగర్ – అన్నారం గేట్ వరకు రోడ్డు సమస్య తీరలేదు.*
*7) షాద్ నగర్ నియోజకవర్గ 6 మండలాలలో ఒక్క ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదు.*
*8) షాద్ నగర్ మహిళా బీసీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయలేదు*
*9) బీసీ, ఎస్సి, మైనారిటీ గురుకుల పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించలేదు*
*10) నూతన డిగ్రీ కళాశాలకు భవనము, బోధన బోధనేతర సిబ్బంది, మౌలిక వసతులు సరిగ్గా కల్పించలేదు*
*11) షాద్ నగర్ లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు పంచలేదు*
*12) ఒక్క మండలంలో కూడా రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ గోదాములు ఏర్పాటు చేయలేదు*
*13) మొగిలిగిద్ద నూతన మండలం ఏర్పాటు సమస్య తీరలేదు*
*14) నియోజకవర్గ మొత్తంలో, ఒక్క గ్రామంలో, ఒక్క మండల కేంద్రంలో, కూడా ప్రజల వ్యాయామం కోసం ఒక్క ఓపెన్ జిమ్ ను కూడా ఏర్పాటు చేయలేదు.*
*15) షాద్నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా గుంతల రోడ్ల సమస్యలు తీరేనా.?*
*16) నిరుద్యోగ భృతి ఎక్కడ ?*
*17)దళితులకు మూడెకరాల భూమి తీరలేదు.*
*18) షాద్ నగర్ లోఇప్పటి వరకు స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చెయ్యలేదు*
*19) దళిత బంధు ఎంత మంది లబ్ధి పొందారు.?*
*చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి*
*ప్రజలారా ఆలోచించండి.!!*
షాద్ నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజాస్వామిక పాలనకు, సామాజిక మార్పు కోసం నూతన నాయకత్వ అవసరం ఎంతైనా ఉంది
అవకాశాలిచ్చినా అభివృద్ధి చేయడం చేతగాని వాళ్లకు మళ్ళీ ఓటు వేసి మీ ఓటును వృధా చేసుకోకండి సామాజిక మార్పుకోసం నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వండి*
*మార్పు కోసం*
*మీ*
*దొడ్డి శ్రీనివాస్*
B.Sc.LL.B,.
అధ్యక్షులు
బహుజన్ సమాజ్ పార్టీ
షాద్ నగర్ నియోజకవర్గం