శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనండి
ప్రజా గొంతుక న్యూస్/సుల్తానాబాద్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గురువారం రోజున రోజున
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర గోశాల ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర ఉట్టి కొట్టుడు కార్యక్రమం సాయంత్రం 05:00 గంటలకు నిర్వహించబడును. ఉట్టి కొట్టిన వారికి బహుమతిగా 2016 రూపాయలు ,
ఉత్తమ శ్రీకృష్ణుని వేషధారణ చేసుకొని వచ్చిన
చిన్నారులకు ప్రోత్సాహ బహుమతులు అందజేయబడును. సుల్తానాబాద్ మున్సిపల్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని శ్రీ ధర్మశాస్త్ర గోశాల ఫౌండేషన్ అధ్యక్షుడు బండారి సూర్య, ప్రధాన కార్యదర్శి నూక రాందాస్,
ఫౌండేషన్ సభ్యులు కోరారు.