Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

*కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బుద్ధి చెప్పాలి

 

* కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్మా జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు.*

 

20న ఆమనగల్లులో బిఆర్ఎస్ ప్రచార జయభేరి సభ కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కాజైపాల్ యాదవ్

ప్రజా గొంతుక న్యూస్ :కల్వకుర్తి

 

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు తరిమికో ట్టాలని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్మా జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలంతా ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని ప్రజా మద్దతుతో మల్లి బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆమనగల్లు పట్టణంలోని శ్రీ లక్ష్మి గా ర్డెన్లో బీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మోవత్ పత్యనాయక్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు.

 

ప్రతి వంద మంది ఓటర్లకు ఒక బలమైన బీఆర్ఎస్ నాయకున్ని నియమించాలని అదేవి ధంగా ప్రతి పోలింగ్ బూతు ఒక కన్వీనర్ను నియమించాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన అభి వృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ఓటరుకు తెలియజేయాలన్నారు. ప్రతి కార్యకర్త ప్రణాళిక బద్ధంగా వెళ్లాలని, అంతర్గత విభేధాలు వీడనాడి, పార్టీ పటిష్ట తకు, అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలుకావడం లేదన్నారు. యావత్ దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపికి సింగల్ డిజిట్ దక్కరన్నారు. కల్వకుర్తికి బీజేపి నేత తల్లోజు

 

పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పుతున్న ఎమ్మెలే

 

ఆచారి ప్రజలకు చేసింది. ఏమి లేదని, ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యేగా పోటీకి దింపుతున్నారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే సీడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడైన చట్టా వంశీచంద్ రెడ్డి తన టికెట్ను రూ. 20 కోట్లకు అమ్ముకున్నాడని ఎమ్మెల్యే ఆరోపిం చారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, వారు సరైన వ్యక్తికే ఓటు వేస్తారన్నారు. ఈ నెల 20 న అనునగల్లు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ప్రచార జయభేరి సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అమనగల్లు మున్సిపాలిటీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన కార్యకర్తలు వీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో జెడ్పిటిసి నేనావత్ అనురాధపత్యనాయక్,

వైస్ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మార్కెట్ చైర్మన్ నాలా పురం శ్రీనివాస్ రెడ్డి, వైస్లెర్మన్ కోట గిరియాదవ్, డ్రైను మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు, మైనార్టీ నాయకులు సయ్యద్ ఖలీల్.. ఎంపీటీసీ దోనాథులు కుమార్, నాయకులు అప్పం శ్రీను, చుక్క నిరంజన్, ఎంగలి రఘు, తల్లోజు రామకృష్ణ, వస్సుల సాయిలు, పూసల సత్యం, గండికోట శంకర్, వడ్డె వెంకటేష్, కొమ్ము ప్రసాద్, జంతుక కిరణ్, అంతుక అల్లాజి, చలిచీనులు సతీష్, కాలె విక్రమ్, విదాయిపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు,

Leave A Reply

Your email address will not be published.