ప్యాకేజిల కోసం పార్టీలు మారే వారికి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలి
ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా/ప్రతినిధి
చర్ల మండలంలోని దేవానగరం, దోసిల్లపల్లి,పెదమిడిసీలేరు,బి. కొత్తూరు గ్రామాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కుంజా ధర్మా గెలుపు ను కాంక్షిస్తు శనివారం ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది..ఈ సందర్బం గా భారతీయ జనతా పార్టీ భద్రాచలం అసెంబ్లీ కో కన్వీనర్ బిట్రగుంట క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్యాకేజి ల కోసం పార్టీలు మారే వారు ప్రజా సమస్యలపై ఎలా పనిచేస్తారని, వారికి ప్రజలు వారి ఓటు తో బుద్ది చెప్పి తరిమి కొట్టాలని, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రపంచం లోనే అతి పెద్ద పార్టీ అని, పార్టీ లోకి వస్తుంటారు, పోతుంటారు.. పోయే వారి వల్ల పార్టీ కి ఎటువంటి నష్టం లేదని అన్నారు..భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కై కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి బిజెపిని గెలిపించాలని,
కాంగ్రెస్,బి ఆర్ ఎస్ పాలన లో నియోజకవర్గం అభివృద్ధి కుంటుబడిందని అన్నారు.ఈ కార్యక్రమం లో ,సీనియర్ నాయకులు యడవల్లి శేషగిరి రావు,మండల ప్రధాన కార్యదర్శి ఆలెం సమ్మయ్య,
కార్యదర్శి చిడెం జగన్ మోహన రావు,బందా మధు, కొండేటి చంద్ర శేఖర్,బూత్ అధ్యక్షులు బట్ట సంజీవ రావు,శివ మునిగేల,వీరాస్వామి,సాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.