పేకాట శిబిరం పై పోలీసుల దాడి.
పోలీసుల అదుపులో 13 మంది.
ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం న్యూస్ పేకాట శిబిరంపై దాడి చేసి 13 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన భద్రాచలం పట్టణ శివారు ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది.భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం
పట్టణంలోని శివారు ప్రాంతంలో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కొత్తగూడెం సీసీఎస్ పోలీసులకు సమాచారం అందింది. సంయుక్త దాడి లో ఈమేరకు 13 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.1 లక్ష 28 వేల 620 లు నగదు, 13 మొబైల్స్, 11 ద్వీచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.