Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమావేశం.

ప్రజా గొంతుక న్యూస్/ సుల్తానాబాద్

 

మండపాలు ఏర్పాటుకు ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలి

ప్రజలు శాంతియుతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని సుల్తానాబాద్ సీఐ జగదీష్ అన్నారు.

రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవ్ కమిటీస్ , మండపం నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా, శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. పోలీసుల సూచనలు, సలహాలను పాటిస్తూ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని కోరారు.

పోలీస్ వారి సూచనలు ముందస్తు జాగ్రత్తలు తెలిపారు.

వినాయక విగ్రహ ప్రతిస్ట ఏర్పాటు చేసుకోవడానికి తప్పని సరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలని అన్నారు. వినాయక చవితి పందిళ్ళ ఏర్పాటుకు పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ పోలీస్ అధికారిని మండపాల నిర్వహణ కమిటీ వారికి 24 గంటలు అందుబాటులో ఉంటారనీ, నిర్వహణ కమిటీ వారికి ఏవిధమైన సమస్య, సందేహాలు వచ్చినా పోలీస్ స్టేషన్ లో గానీ, లేక డయల్ 100 సంప్రదించాలని సూచించారు. మండపాల వద్ద శబ్ధ కాలుష్యం లేకుండా ఉండే విధంగా స్పీకర్లను ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా
రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను ఎట్టిపరిస్థితులలోను ఉపయోగించరాదనీ. అలాగే మండపాలలో దీపారాధనల వలన అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రతలు తీసుకోవాలనీ, విద్యుత్ వైర్లను ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలని, ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలని, భద్రత కోసం రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా నిర్వహణ కమిటీ వారి వాలంటీర్ కాపల ఉండాలి. మండపాల వద్ద ఏ విధమైన అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు నీరు, ఇసుకను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే ప్రతి పందిరి వద్ద నిర్వహకులు సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు, ఏర్పాటు చేసుకోవాలని,

ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎస్సై విజేందర్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై శ్రీనివాస్, పోత్కపల్లి ఎస్సై శ్రీధర్, జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.