*తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు*
ప్రజా గొంతుక న్యూస్/జగిత్యాల/రాయికల్
రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామ వెలమ సంక్షేమ సంఘం సభ్యులు జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పై మంగళవారం వెలమ సంక్షేమ మండలి అధ్యక్షులు దుగ్యాల రాజేశ్వరరావు మరియు సంఘ సభ్యులు ఫిర్యాదు చేశారు
గత కొద్ది రోజుల క్రితం వెలుమ కుల సామాజిక వర్గాన్ని కులం పేరుతో దూషిస్తూ అవహేళన చేసేలా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడాడు అని వెలమ కులస్తుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించినందుకు అతనిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అని తెలిపారు