గోపరాజు పల్లి లో మారిన రాజకీయ సమీకరణాలు.
బిఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఎం త్రిముఖ పోటీ
నవంబర్ 20 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండమండలంలోని గోపరాజుపల్లి గ్రామంలో రోజురోజుకు రాజకీయాలు తారుమారు అవుతున్నాయి.
నిన్న మొన్నటి వరకు ఎదురే లేదని చెప్పినా బిఆర్ఎస్, కాదు మేమే ముందున్నాం అంటూ చెప్పిన కాంగ్రెస్ సోమవారం నాటికి సిపిఎం పార్టీ రంగంలోకి దూసుకు రావడంతో త్రిముఖ పోటీ ఉండటం విశేషం. సోమవారం భువనగిరి నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి కొండమడుగు నరసింహ ప్రచారం గ్రామంలో జోరుగా సాగింది.
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ పేదల పక్షాన కొట్లాడేది ఒక సిపిఎం పార్టీ మాత్రమేనని అందుకే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీ బలపరిచిన కొండమడుగు నరసింహ ఎమ్మెల్యే అభ్యర్థి సుత్తి కొడవలి సుక్క గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నరసింహ సిపిఎం మండల కార్యదర్శి సిరిపంగి స్వామి మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు మద్దెల రాజయ్య. గ్రామ శాఖ కార్యదర్శి ఎనుగుల నరసింహ చలిగంజి నరసయ్య గాజుల మల్లయ్య మంద సంజీవ సలిగంజి రాజయ్య గాజుల వెంకటేశం. రుద్రపల్లి లింగయ్య గాజుల పద్మ సునీత ఎల్లమ్మ లక్ష్మమ్మ
.తదితరులు పాల్గొన్నారు