బచ్చన్నపేట మండలంలో రసవత్తరంగా మారిన రాజకీయం
పిఎసిఎస్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం
ప్రజా గొంతుక /బచ్చన్నపేట
బచ్చన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వైస్ చైర్మన్ బెజడి సిద్దులు పై అవిశ్వాస తీర్మానం ను పిఎసిఎస్ పాలకవర్గం సభ్యులు గత నెల 31 రోజున జనగామ జిల్లా సహకార అధికారికి కలిసి అవిశ్వాస తీర్మాణ వినతి పత్రాన్ని అందించడం జరిగింది.
మంగళవారం రోజున బచ్చన్నపేట మండలకేంద్రంలోజిల్లాఅధికారులైనటువంటి జనగామ జిల్లా సహకార సంఘం అధికారి రాజేందర్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్టార్ శంకర్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి వారి సమక్ష్యంలో అవిశ్వాసం తీర్మానం జరిగింది. 11 మంది సభ్యులు ఓటు వేయడంతో వైస్ చైర్మన్ బెజడి సిద్ధులు పై అవిశ్వాసం నెగ్గింది.
మరి ఎవరు రాబోయే రోజులో వైస్ చైర్మన్ కాబోతున్నారో వేచి చూడాల్సిందే
ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్, డైరెక్టర్లు శాడగొండ నర్సిరెడ్డి, తుంకుంట రాధ,ఇండ్ల రాములు,కానుగంటి భానుచందర్,వేముల లక్ష్మన్ గౌడ్, నిమ్మ శ్యామ్ సుందర్ రెడ్డి, తాడిచేట్టు యాదమ్మ, దాసరం శ్రీనివాస్, గడిపే ప్రభాకర్, సిద్దిరాములు పాల్గొన్నారు.