కానిస్టేబుల్స్ గా పేదింటి బిడ్డలు.
విద్యార్థినులకుఅభినందనలు తెలియజేసిన ప్రధానోపాధ్యాయులు నరసింహస్వామి.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
అక్టోబర్ 05.2023 న విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలలో జోగులాంబ గద్వాలజిల్లాఅలంపురం నియోజకవర్గంఇటిక్యాల మండలంలోనిచాగాపురం గ్రామానికి చెందిన కురువ పార్వతమ్మ భర్త చిన్నదేవన్నదంపతులకు జన్మించిన కే అనిత సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ఇదే మండలం షాబాద్ గ్రామానికి చెందిన గొల్ల పుష్పావతి భర్త గొల్ల వెంకటన్న దంపతులకు జన్మించిన గొల్ల శ్వేత కూడా కానిస్టేబుల్ ఫలితాలలోసివిల్,కానిస్టేబుల్గాఎంపికయ్యారు. వీరు తమ ప్రాథమిక విద్యను (పదవతరగతి) వరకుజిల్లాపరిషత్ఉన్నతపాఠశాలచాగాపురంనందుఅభ్యసించారు.
వీరిలోకే.అనితఇంటర్మీడియట్ మరియు టిటిసి వడ్డేపల్లిమండలంశాంతినగర్ లో పూర్తి చేశారు.
షాబాదగ్రామానికిచెందినజి.శ్వేతఇంటర్మీడియట్వనపర్తినందుడిగ్రీమహబూబ్ నగర్ నందు పూర్తి చేసి,పాలమూరువిశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న క్రమంలో తాజాగా వెలువడిన కానిస్టేబుల్ ఫలితాలలో సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికకావడంపట్లవిద్యార్థినిల తల్లిదండ్రులు సంబరం ఆశ్చర్యాలకు గురవుతూ కూతుళ్ళతో ఆనందాన్నిపంచుకున్నారు.
విషయంతెలుసుకున్న చదువునేర్పినప్రధానోపాధ్యాయులునరసింహస్వామి విద్యార్థినిల గురించి మాట్లాడుతూ, వారి కుటుంబాలు పేదరికంలోఉన్నవిద్యార్థినిలు మాత్రం చదువులో ఎప్పుడు ముందు ఉండేవారని గుర్తు చేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూఆనందాన్ని వ్యక్తం చేశారు. (చదువు నేర్పిన గురువు చాగాపురం నుండి పాల్వాయికి బదిలీ కావడం విశేషం.)