స్వేచ్చా, శాంతియుత, ప్రశాంతమైన మరియు ప్రలోభ రహిత –ఎన్నికలను నిర్వాహణ కొరకు ముందస్తు చర్యలు:
రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐ.పీ.ఎస్ (డిఐజి)
ప్రజా గొంతుక పెద్దపల్లి :
భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని పోలీసు అధికారులందరూ రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ, వాణిజ్య పన్నులు, రవాణా శాఖలతో కలిసి‘ఉమ్మడి కార్యాచరణ’ ద్వారా కమిషనరేట్ పరిధిలోకి ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే ఎలాంటి వస్తువులను సరఫరా చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కి జరగనున్న ఎన్నికల దృష్ట్యా ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ గురించి రెమా రాజేశ్వరి, IPS., మాట్లాడుతూ.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తేదీ 09-10-2023 నుండి ఇప్పటివరకు రూ. 3,17,23,770.75/- కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు, మద్యం, బెల్లం, పటిక, గంజాయిని రామగుండం కమిషనరేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపినారు.
ప్రేరేపిత రహిత ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటివవరకు జప్తు చేసిన వాటి వివరాలు:
రూ. 2,68,01,826/-నగదు.
రూ.2,89,5071/- విలువ గల 78 గ్రాముల బంగారం మరియు 42.081 కిలోల వెండి స్వాధీనం.
రూ. 1,41,050/- విలువ చేసే 5.639 కిలోల గంజాయి స్వాధీనం.
మద్యం-3078.845 లీటర్లు, పటిక-295 కిలోలు, బెల్లం-1160 కిలోలు స్వాధీనం. వీటి విలువ రూ.15,38,823.75/-
14 స్పీకర్లు, 02-యాంప్లిఫయర్లు, 6 టేకు దుంగలు, 760 చీరలు స్వాధీనం. వీటి విలువ 2,89,5071/- రూపాయలు
438 కేసుల్లో 1393 మందిని 107 Cr.PC, 110 Cr.PC మరియు 151 Cr.PC సెక్షన్స్ కింద బైండోవర్.
56 NBWలు అమలు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 35 మంది ఆయుధాల లైసెన్స్ కలిగిన వ్యక్తులు కలరు. వీరిలో (30) మంది ఆయా పోలీస్ స్టేషన్లలో ఆయుధాలను డిపాజిట్ చేశారు. ఇందులో బ్యాంకు సెక్యూరిటీ సిబ్బందికి మాత్రమే మినహాయింపు కలదు.
LWE ప్రభావిత ప్రాంతాలు మరియు క్లిష్టమైన పోలింగ్ లొకేషన్ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు ఓటు హక్కు వినియోగం పై అవగాహన చర్యలు:
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు మరియు గ్రామాల్లో ఎన్నికలపై గ్రామాల ప్రజలకు పోలీసు కళాబృందం ద్వారా జానపద కథలు, నాటకాలు మరియు పాటల ద్వారా పౌరులకు ఓటు హక్కు గురించి మరియు వారు నిర్భయంగా ఓటు వేయడానికి శాంతియుత వాతావరణాన్ని కలిపించడం కోసం పోలీస్ వారు తీసుకుంటున్న చర్యల గురుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిoచడం జరుగుతుంది.
కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వివిధ ప్రదేశాలలో 428 నఖా బందీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిది మంచిర్యాల జోన్ రాపనపల్లి వద్ద అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఏర్పాటు అదేవిధంగా అంతర్ జిల్లాల సరిహద్దుల వద్ద 09 చెక్ పోస్ట్ ల ఏర్పాటు చేయడం జరిగింది .
రాబోయే ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర పారా మిలటరీ బలగాలు (CAPF) రావడం జరిగింది. వారి సేవలు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST), చెక్ పోస్ట్ ల నిర్వహణ మరియు వివిధ ముందస్తు ఎన్నికల అమలు కార్యకలాపాలలో సమర్థవంతంగా ఉపయోగించబడతాయి.
మోడల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై C-VIGIL యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదు దాఖలు చేసినట్లైతే చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.
మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో సామాన్య ప్రజలు నగదు, బంగారం/వెండి, విలువైన వస్తువులను తీసుకువెళుతుంటే సరియైన ఆధారాలు తమ వెంట తీసుకెళ్లాలని సీపీ రామగుండం విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఈ క్రింది వస్తువులను ఉచితంగా పంపిణీ చేయకుండా అనుమానాస్పదంగా తరలించడం/నిల్వ ఉంచడంపై గట్టి నిఘా ఉంచామని కూడా సి.పి. గారు పేర్కొన్నారు.
1. సీలింగ్ ఫ్యాన్లు
2. ప్రెజర్ కుక్కర్లు
3. మిక్సర్లు మరియు గ్రైండర్లు
4. చీరలు
5. కుట్టు యంత్రాలు
6. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు
7. ఎలక్ట్రానిక్ వస్తువులు/టీవీ సెట్లు
8. గోడ గడియారాలు
9. గడియారాలు
10. క్రికెట్ కిట్లు
11. ఆభరణాల వస్తువులు
12. ఇతర క్రీడా వస్తువులు
13. బెడ్ షీట్లు/తువ్వాళ్లు
14. సైకిళ్ళు మరియు బైకులు
15. సౌందర్య సాధనాలు
16. జిమ్ పరికరాలు
17. బంగారం లేదా వెండి పూత పూసిన వస్తువులు (అనుకరణ ఆభరణాలు)
18. కుంకుం భరణి
19. మొబైల్స్
20. రెడీమేడ్ వస్త్రాలు
21. స్కూల్ బ్యాగులు
22. T షర్టులు
23. టార్చ్ లైట్లు
24. బొమ్మలు
25. ట్రావెల్ బాగ్స్/సూట్ కేసులు
26. గొడుగులు
ప్రజలు, వ్యాపారులు సరైన పత్రాలను ఉంచుకుని అధికారులకు సహకరించాలని సి.పి. విజ్ఞప్తి చేశారు.