కే.వి.కే గడ్డిపల్లిలో ప్రధానమంత్రి 15వ విడత పీ.ఎం.కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నగదు బదిలీ ప్రత్యక్ష వీక్షణ కార్యక్రమం.
ప్రజా గొంతుక న్యూస్/ సూర్యాపేట జిల్లా
శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం-గడ్డిపల్లి లో 15వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నగదు బదిలీ కార్యక్రమంలో భాగంగా కె.వి.కె లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష వీక్షణ కార్యక్రమంలో SAIRDKVK- గడ్డిపల్లి డైరెక్టర్ జి. అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను, విద్యార్థులును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాన్ మంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్ లోని ఖుంటిలోని బిర్సా అగ్రికల్చర్ కాలేజీలో జన జాతీయ గౌరవ దివాస్ (ఆదివాసి ఫ్రైడ్ డే) ని పురస్కరించుకొని కిసాన్ సమ్మాన్ నిధి (PMKISAN) పథకం యొక్క 15వ విడతను ప్రధానమంత్రి
సుమారు 8 కోట్ల మందికి పైగ లబ్ధిదారులకు 18,000 కోట్లు రూపాయలను విడుదల చేశారని తెలిపారు.ఈ పథకం అనేది భూమిని కలిగి ఉన్న రైతులకు మరియు వారి కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందించేది అన్నారు. తదుపరి భారతదేశంలో 50 శాతానికి పైగా జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉందని కావున వ్యవసాయంలో తీసుకువచ్చే కొత్త శాస్త్రీయ పద్ధతులను రైతులు ఉపయోగిస్తే ఎంతో లాభదాయకమని తెలిపారు. భారత జనాభా రోజు రోజుకి పెరిగిపోవడం వలన ఆహార భద్రతపై కేంద్రం దృష్టి సారించి రైతులకు ఉపయోగపడే స్కీములను సబ్సిడీలను అందిస్తుందన్నారు. రైతులు అందరూ కేవలం ఒకే పంట పై ఆధార పడకుండా సమగ్ర వ్యవసాయ విధానం లో భాగంగా వరితో పాటు, కూరగాయలు, పండ్ల మొక్కలు, పెరటి కోళ్లు, పశువులు, చేపల పెంపకం చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీకే ఇంచార్జ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి.నరేష్ మాట్లాడుతూ కె.వి.కె లో జరిగే వివిధ కార్యక్రమాల గురించి, రైతులకు ఇచ్చే శిక్షణ కార్యక్రమాల గురించి కెవికెలో అందుబాటులో ఉండే వివిధ ఉత్పత్తులైన జీవన ఎరువులు, విత్తనాలు, కూరగాయల నారు, పండ్ల మొక్కలు, వర్మి కంపోస్ట్, అజోల్లా, గురించి తెలియజేశారు. రైతులు హానికరమైన పురుగుమందులు మరియు ఎరువులను వాడకుండా సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తూ తక్కువ ఖర్చుతో పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా వ్యవసాయం చేయాలని సూచించారు. మోదీ ప్రసంగాన్ని కేవీకే శాస్త్రవేత్తలు తెలుగులోకి అనువదించారు. ఈ కార్యక్రమంలో కే. వి. కే శాస్త్రవేత్తలు ఎ. కిరణ్, ఎన్.సుగంధి, కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎ.నరేష్, ఆఫీస్ సిబ్బంది బి.ఉపేందర్, ఎమ్.సైదులు, బి.రాంరెడ్డి గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం పొందుతున్న మల్లరెడ్డి యూనివర్సిటీ బి.యస్.సి వ్యవసాయ డిగ్రీ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.