చేతి వృత్తుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రధాన మంత్రి మోదీ
*కలకొండ.నరేష్
మాడుగుల:ప్రజా గొంతుక ప్రతినిధి
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రధాని మోడీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు బిజెపి విశ్వకర్మ సెల్ మండల అధ్యక్షుడు కలకొండ నరేష్ అన్నారు. మండలం కేంద్రంలో నరేష్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మోది పాలన సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
చేతి వృత్తుల వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. భాగంగా ఎంపిక అయిన లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చి పని పనిముట్లు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని చేతివృత్తుల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు