ప్రజాస్వామ్య పరిరక్షణ . వేదిక జిల్లా కో కన్వీనర్ గా…. బండారు నరసింహారెడ్డి నియామకం……
సెప్టెంబర్ 28 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి…….
. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని అరూరు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త బండారు నరసింహారెడ్డిని.. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా కో కన్వీనర్ గా నియమిస్తూ సూర్యపేటలో
ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర కమిటీ.. కన్వీనర్ వెంపటి రాము కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు… ఈ సందర్భంగా బండారు నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు….
ప్రభుత్వ కార్యాలయాలలో ఎలాంటి అవినీతి లేకుండా అధికారులు ప్రజలకు పనిచేసేలా చూస్తానని ఆయన అన్నారు గురువారం ప్రజా గొంతుక ప్రతినిధితో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా కృషి చేస్తానని అధికారులు కూడా నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని ఆయన అన్నారు