రోడ్లను పట్టించుకోని ప్రజాప్రతినిధులు… నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు…
సెప్టెంబర్ 24 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి..
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని కూత వేటు దూరంలో ఉన్న. మల్లె పెళ్లి గ్రామానికి వెళ్లే రహదారి చెరువును తలపిస్తుండడంతో అటువైపు వెళ్లే వాహనదారులు ప్రజలు అనేకసార్లు గుంటలలో పడి ఆసుపత్రి పాలైన సంఘటనలు కోకొల్లలు.. ఆ దారి వెంట వెల్వర్తి టు అరూర్.
ప్రజలు అనేక ఇబ్బందులకు గురి కావడం ప్రతిరోజు ఏదో ఒకచోట యాక్సిడెంట్లు కావడం రోడ్ల వెంబటి గుంటలు కనిపించకపోవడంతో వాహనదారులు పడిపోవడం సర్వసాధారణమైనవి ఇట్టి రహదారి విషయం అనేకసార్లు వార్త కథనాలు వచ్చిన అధికారుల దృష్టికి వచ్చిన చూసి చూడనట్లు వదిలేయడం పరిపాటిగా జరిగింది.. మరి అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్తున్న ప్రజాప్రతినిధులు మరి ఈ రోడ్డు కనిపించడం లేదా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకు వాహనదారులకు జరగరాని నష్టం జరగకుండా ఉండాలంటే.
ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడతామని ప్రజలు కోరుచున్నారు