అంబులెన్సులోనే పురుడు పోసిన రాయికల్108 సిబ్బంది
ప్రజా గొంతుక /రాయికల్
రాయికల్ పట్టణానికి చెందిన చెర్ల లావణ్య సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పురిటీ నొప్పులతో బాధపడుతూ సమీపంలో ని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యసిబ్బంది మేడం లేదు సిస్టర్ కూడా అందుబాటులో లేరు జగిత్యాల కు వెళ్ళమని అంబులెన్స్ కి కాల్ చేయగానే వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్నా అంబులెన్సు సిబ్బంది ఈఎంటీ రామ్ మరియు పైలట్ మహేష్… జగిత్యాల మాతశిశు ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలో పురిటినొప్పులు అధికమవడంతో టెక్నిషియన్ రామ్ చాకచాక్యంగా వ్యవహరించి పైలట్ ని రోడ్డుపక్కన అంబులెన్సిని నిలిపివెయమని కోరి అంబులెన్సెలోనె పురుడు పోయగా పండంటి ఆడపిల్ల జన్మించింది..తల్లి బిడ్డలను క్షేమంగా మాతశిశు ఆసుపత్రి కి తరలించారు..
దీనితో ఊపిరిపిల్చుకున్న ఆమె భర్త మరియు ఆమె బంధువులు 108 సిబ్బందికి క్రుతజ్ఞతలు తెలియజేసారు..!
ఇట్టి విషయాన్ని తెలుసుకున్న 108 మేనేజర్ సలీమ్ మరియు సూపర్వైజర్ రాజశేఖర్ లు టెక్నిషియన్ రామ్ ని పైలట్ మహేష్ ని అభినందించారు…