తెలంగాణలో 9 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు
కేంద్ర ఐటీ కమ్యూనిటీ సహాయ మంత్రి రాజు చంద్రశేఖర్
ప్రజా గొంతుక న్యూస్/సూర్యాపేట జిల్లా
కేంద్ర ఐటీ కమ్యూనిటీ సహాయ మంత్రి రాజు చంద్రశేఖర్ సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో 9 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని రైతులను ప్రజలను మోసం చేశారని కుటుంబ పాలనలో తెలంగాణ వెనుకబడిపోయిందని తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదని, రైతులకు మద్దతుగా నిలిచింది బిజెపి ప్రభుత్వమేనని, తెలంగాణలో తీసుకొచ్చిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ స్కూల్స్, కాలేజీలు మావల్లనే సాధ్యమైందని తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల తెలంగాణగా చేశారని మూడు నెలల ముందు లిక్కర్ కు డోర్లు తెరిచి కమిషన్ల కొరకు కక్కుర్తి పడ్డ ప్రభుత్వం బీఆర్ఎస్ తెలంగాణను లిక్కర్ తెలంగాణ గా మార్చిన ఘనత కేసిఆర్ కే దప్పుతుందన్నారు కూతుర్ని ఢిల్లీ పంపించి భారీగా స్కాములకు పాల్పడ్డాడని తెలంగాణకు కెసిఆర్ చేసింది ఏమీ లేదని యువకులకు విద్యార్థులకు రైతులకు చేసింది ఏమీ లేదని తెలంగాణలో ప్రజల బతుకులు మారాలన్న తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలన్నా బీజేపీతోనే సాధ్యమవుతుందని హుజూర్ నగర్ నియోజకవర్గంలో బిజెపి గెలిచి రాష్ట్రవ్యాప్తంగా భారీగా సీట్లు సాధిస్తామని తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలను కేటాయించి గ్రామస్థాయిలో అభివృద్ధికి కృషి చేసిన పార్టీ బిజెపి పార్టీ అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, రాష్ట్ర నాయకుడు సంకినేని, గట్టు శ్రీకాంత్ రెడ్డి మరియు బిజెపి జిల్లా నాయకులు హుజూర్ నగర్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు