Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

ప్రియుడి తో కలసి బర్తని హత్యమర్చిన భార్య ని, ప్రియుడిని మరియు అందుకు సహకరించిన వారిని అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు

 

ప్రజా గొంతుక పెద్దపల్లి :

తేదీ 29-10 -2023 రోజు రాత్రి రామగుండం పరిధి లో జరిగిన హత్య కేసు నిందితులను 48 గంటలు తిరక్కముందే రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.

మాల్యాలపల్లి సబ్ స్టేషన్ కి సమీపంలో తేదీ 29-10-23 రోజున రాత్రి సమయం రాత్రి సమయంలో మెయిన్ రోడ్డు పక్కన సైడ్ కెనాల్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడనే సమాచారం మేరకు రామగుండం ఎస్ ఐ వెంకటేష్ , సి ఐ, చంద్ర శేఖర్ గౌడ్, ఏ సీ పీ తుల శ్రీనివాస్ రావు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి ఆనవాళ్ళ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు *లావుడియ మధుకర్, తండ్రిపేరు: నాన్యా నాయక్, 30 సం, నివాసం: పోతన కాలనీ,8 incline కాలనీ* అని తెలిసినది.

మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేయగా నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చింది మృతుడిని అతడి భార్య లావుడియా @ నునసవత్ రమ తన అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని తన ప్రియుడు గోవర్ధన్ మరో ఇద్దరితో కలసి పథకం ప్రకారం హత్య చేసినారని తెలిసింది

 

*సంఘటన నేపథ్యం*

 

మృతుడు లావుడియ మధుకర్ సింగరేణి ఉద్యోగం చేస్తూ పోతన కాలనీ, 8 incline కాలనీ గోదావరిఖని ఉంటున్నాడు. మృతుడి భార్య లావుడియా @ నునసవత్ రమ కి ఒక పెళ్లి సంబంధం విషయంలో ధరావత్ గోవర్ధన్ అనునతడితో పరిచయం అయి వారి పరిచయ అక్రమ సంబంధం గా మారినది. గోవర్ధన్ తరచు మృతుడి ఇంటికి వస్తూ పోతూ మరియు మృతుడి భార్య తో ఫోన్లో మాట్లాడుకోవడం ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడే రెండు మూడు రోజులు ఉండేవాడు, అది చూసి మృతుడికి అతడి భార్య పై అనుమానం రావడం తో అతడిని చంపేయాలని తర్వాత ఎటువంటి అడ్డు ఉండదు అని నిందితురాలు చెప్పగా గోవర్ధన్ కూడా సరే అని ఒప్పుకున్నాడు. నిందితుడు గోవర్ధన్ మృతుడు మధుకర్ ని ను బయటకు ఎటు అయిన తీసుకు వెళ్ళి మందు తాగిచ్చి చంపి ఎవ్వరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదం లా చనిపోయినట్లు చిత్రీకరిస్తే నీకు కూడా ఉద్యోగం వస్తది అని పథకం వేసుకొన్నారు.

సంఘటన జరిగిన తీరు

తేదీ 29 10 2023 నాడు మృతుడు ఉదయం యధావిధిగా డ్యూటీ కి పోయి తిరిగి మధ్యాహ్నం కాలుకు దెబ్బ తగిలిందని వచ్చి భోజనం చేసి మధ్యాహ్నం మూడు గంటలకు మళ్ళీ డ్యూటీ కి పోయి అందాజ మూడున్నర గంటలకు ఇంటికి వచ్చినడు. సాయంత్రమే గోవర్దన్ అతడి స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్ లతో కలసి నాచారం నుండి మధుకర్ ను చంపాలనే ఉద్దేశ్యం తో ఒక ఇనుప రాడ్ నాగరాజు యొక్క హీరో గ్లామర్ బైక్ ఫూట్రెస్ట్ వద్ద కనబడ కుండ కట్టుకొని గోదావరిఖని కి వచ్చి, రాత్రి 07:00 గంటలకు గోవర్ధన్ నిండుతురాలు రమకి ఫోన్ చేసి మృతుడి తో మాట్లాడి బయటకి రమ్మని చెప్పగా మృతుడు మధుకర్ తన పల్సర్ బైక్ పై రావడం తో అందరూ గోదావరిఖని 5 ఇంక్లైన్ వద్ద కలసుకొని అక్కడ రాజా రాణి వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసి అందరూ కలసి మాల్యాలపల్లి సబ్ స్టేషన్ వద్ద u టర్న్ తీసుకొని మంచిర్యాల వెళ్ళే రోడ్డు వైపుకి కొద్ది దూరం వచ్చి రోడ్డు పక్కన మోటార్ సైకిళ్ళు అపి చెట్లల్లో తాగుతుండగా గోవర్ధన్ ముందుగానే మోటార్ సైకిలు కి కట్టుకున్న ఇనుప రాడ్ ని తీసుకుని మృతుడికి కనబడకుండా అతడి వెనుక కనబడకుండా పెట్టి అనతరం గోవర్ధన్ అతడి ఫ్రెండ్స్ నాగరాజు, లక్ష్మణులము కలిసి ఇనుపరాడళతో తలపై కొట్టి చంపిన, తర్వాత మృతదేహాన్ని తీసుకువచ్చి మెయిన్ రోడ్డు పక్కన సైడ్ కెనాల్ లో పడేసి అతని పల్సర్ బైక్ డామేజ్ చేసి, స్టార్ట్ చేసి అతని మీదకు వదిలి పెడితే అది పక్కకు పడినది, ఈ విషయం గోవర్ధన్, మృతుడి భర్య రమకి వాట్స్ అప్ ద్వారా ఫోన్ చేసి చెప్పి అనంతరం నిందితులంతా మోటార్ సైకిల్ పై పారిపోయినారు.

 

నిందితురాలు రమ మృతుడి తల్లిదండ్రులకి బంధువులకి తన భర్త రోడ్డు ప్రమాదంలోనే చనిపోయినాడు అని అనుకునేలా నమ్మబలికినది.

 

*నిందితులు పట్టుబడిన విధానం*

 

మృతుడి తల్లిదండ్రులు, సోదరులు మృతుడి భార్య రమ నే తన భర్తని హత్య చేయించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు విచారణ జరిపి మృతుడి హత్యలో అతడి భార్య రమ తో పాటు మరో ముగ్గురు పాత్ర కూడా ఉందని బయటపడడం తో నిందితులందరిని అదుపులోకి తీసుకొని విచారించగ వారు చేసిన నేరం అంగీకరించడం జరిగినది.

 

*అరెస్ట్ చేసిన నిందితుల వివరములు*

 

లవుడియా @ నునసవత రమ, మధుకర్, వయసు: 26 సం, కులం: st లంబడ, నివాసం: సింగరేణి క్వార్టర్ నెం T1 -6 3 0, పోతన కాలనీ,8 incline కాలనీ గోదావరిఖని

 

దరావత్ గోవర్ధన్, తండ్రిపేరు: రమేష్, వయసు: 23 సం, కులం: st లంబడ, వృత్తి: డ్రైవరు, నివాసం: మల్లయ్యపల్లి, నాచారం, మల్హర్రావు మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.

 

కోట లక్ష్మణస్వామి, తండ్రిపేరు: పోచయ్య, వయసు: 19 సం, వృత్తి: కూలి, నివాసం: కొత్తపల్లి గ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ప్రస్తుతం నాచారం, మల్హర్రావు మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.

 

కర్నె నాగరాజు, తండ్రిపేరు: స్వామి, వయసు: 23 సం, కులం: మున్నూర్ కాపు, వృత్తి: డ్రైవరు, నివాసం: ఖాసింపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా

 

ఇట్టి పత్రికా సమావేశంలో ఈ ఏసిపి వెంట రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రామగుండం ఎస్సై వెంకట్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.