పునరావాసం సంగతి సరే …శాశ్వత పరిష్కారం చూపేదేమైనా ఉందా ?
ప్రజా గొంతుకన్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో గోదావరి కి వరదలు రావడం,ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం వరద తగ్గుముఖం పట్టగానే గ్రామాలకు ప్రజలు తిరిగి వెల్లడం,గొడ్డూగోదా ,ఇంట్లో వస్తువులు, కొట్టుకుని పోవడం ఆ పరిస్థితులు చూసి ప్రజలు బాధపడటం సర్వసాధారణం అయిపోయిందని, తెలంగాణ రాష్ట్రం లో అయినా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని కొండంత ఆశతో ఉన్న భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు నిరాశే మిగిలిందని,వరద ముంపు గ్రామాల ప్రజలను అందుకోవడం లో బిఆర్ఎస్ ఆద్వర్యంలో ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిదని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ చార్జ్ తడికల శివకుమార్ అన్నారు.ఎన్నో ఏళ్లుగా వరద కష్టాలు పడుతున్న చర్ల మండలం లోని కొత్తపల్లి,లింగాపురం, గొంపల్లి, తదతర గ్రామాల ప్రజలకు ఎత్తైన ప్రాంతంలో శాశ్వత నివాసాలు నిర్మించి ఇవ్వాలని .అలా చేయని పక్షంలో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆద్వర్యంలో ని బిఎస్పీ రాబోయే ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని అప్పుడు ఈ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈతవాగు లోలెవల్ చప్టాను ,హై లెవల్ బ్రిడ్జ్ గా మారుస్తామని అన్నారు.వరదలు సాదారణ స్థాయికంటే ఎక్కువ గా రావడానికి ప్రభుత్వం అక్రమార్కులతో కలిసి నిర్వహిస్తున్న ఇసుక రీచులలేనని,ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా ,ఏజెన్సి చట్టాలను తుంగలో తొక్కి నిర్వహిస్తున్న ఇసుక రీచులు వల్లే ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని,బిఎస్పీ ప్రభుత్వం లో ఏజెన్సీ చట్టాలైనా,పీసా,1/70,వాల్టా చట్టాలను కటినంగా అమలు చేస్తామని అన్నారు.