Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

తుది ఓటర్ జాబితా విడుదల….. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ప్రజా గొంతుక పెద్దపల్లి :

జిల్లాలో తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 

పెద్దపల్లి జిల్లాలో మంథని , రామగుండం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తుది ఓటరు జాబితా విడుదల చేశామని, జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 45 వేల 829 మంది పురుషులు, 3 లక్షల 48 వేల 729 మంది మహిళలు, 54 ఇతర జెండర్, మొత్తం 6 లక్షల 94 వేల 612 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

 

పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో లక్షా 23 వేల 768 మంది పురుషులు, లక్షా 25 వేల 555 మంది మహిళలు, 9 ఇతర జెండర్, మొత్తం 2 లక్షల 49 వేల 332 మంది ఓటర్లు, రామగుండం నియోజకవర్గం పరిధిలో లక్షా 8 వేల 233 మంది పురుషులు, లక్షా 6 వేల 716 మంది మహిళలు, 25 ఇతర జెండర్, మొత్తం 2 లక్షల 14 వేల 974 మంది ఓటర్లు, మంథని నియోజకవర్గం పరిధిలో లక్షా 13 వేల 828 మంది పురుషులు, లక్షా 16 వేల 458 మంది మహిళలు, 20 ఇతర జెండర్, మొత్తం 2 లక్షల 30 వేల 306 మంది ఓటర్లు తుది జాబితాలో ఉన్నారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.