వీఆర్ఎ లకు న్యాయం చేయాలని మంత్రికి వినతి
ప్రజా గొంతుక ప్రతినిధి నల్గొండ జిల్లా 05
వీఆర్ఎ హక్కుల సాధన సమితి రాష్ట్ర కో కన్వీనర్ కిలారి దుర్గాప్రసాద్ శనివారం ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. వీఆర్ఎ క్రమబద్ధీకరణలోవయస్సు తప్పుగా పడిన వీఆర్ఎ ల వివరాలు మళ్ళీ సేకరించి వారికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.