మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందచేసిన పోచమ్మ గడ్డ నివాసులు
రాజేంద్ర నగర్ :ఆగస్టు 30(ప్రజా గొంతుక )
50సంవత్సరల క్రితం నుండి శంషాబాద్ పోచమ్మ గడ్డలోని 145వ సర్వేనెంబర్ లోని కొంత భూమిలో బస్తీ నివాసుల కొరకై మరుగుదోడ్లు మరియు ఇతర అవసరాలకు ఉపయోగించేవారు, వాటి శిధిలానంతరం
కొంత భూమిలో ఎంపిడిఓ నిధుల ద్వారా కమిటీ హాల్ ని ప్రభుత్వం నిర్మించి ఇవ్వడం జరిగింది. ఇదే సర్వే నంబర్లు కొంత భూమి మాకే చెందుతుంది అని కొంతమంది వ్యక్తులు ప్రహరీ గోడ నిర్మించడం పట్ల అభ్యంతరం తెల్పతు
గతంలో అనేకసార్లు ఎంఆర్ఓ, గ్రామపంచాయతీ లో పిర్యాదు చేయడం, అదే విధంగా కమిటీ హాల్ కొరకై వదిలిన స్థలానికి పూర్తిగా కాపాడాలని కోరడం జరిగింది. అదే విధంగా అట్టి వివాదాస్పద పనులకు ప్రభుత్వ నిధులను సమకూర్చడాని బస్తీ వాసులుగా మేము వ్యతిరేకించడం జరుగుతుంది. కబ్జాలకు గురి అయిన బస్తి స్థలం యొక్క సమస్యను పెద్దల సమక్షంలో
పరిష్కరించగలరని దని తర్వాతనే మిగిత పనులపై ఆలోచించాలి అన్ని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు దేవేందర్, సేవెళ్ల సాయిరాం, ప్రమోద్ ,సేవెళ్ల.మహేందర్, వినయ్ కుమార్,మల్కాజ్గిరి వెంకటేష్, మహేష్, రాకేష్ రాజ్ ,వంశీ, ఈశ్వర్, ప్రదీప్, ధర్మేందర్, శ్రీకాంత్, వరుణ్, రాజు, వాసు, చరణ్, తదితరులు పాల్గొనడం జరిగింది.