మానవత దృక్పథంతో రైతుబంధు జిల్లా అధ్యక్షుడి సహాయం, పరామర్శ
జనగామ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు రమణారెడ్డి.
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనగరం గ్రామంలో గత వారం రోజుల క్రితం బండ నాగారం గ్రామ వాసి శోభ ,బీబీనగర్ లో రోడ్డు ప్రమాదంలో మరణించగా విషయం తెలుసుకున్న
బిఆర్ఎస్ నాయకులు రైతుబంధు జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చంద్రారెడ్డి, బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి,కొ ఆప్షన్ సభ్యులు షబ్బీర్,ఆ కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
అనంతరం బండ నగరం మాజీ సర్పంచ్.చల్ల సుధాకర్ రెడ్డి చల్ల రమేష్ రెడ్డి తల్లి. చల్ల కమలమ్మ మృతి చెందగా వారి పార్థ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించి ,వారికి మనోధైర్యాన్ని నింపి బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో బండ నాగారం సర్పంచ్ కవితా రాజనర్సయ్య, మాజీ సర్పంచ్ కొప్పురపు నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,రాపిల్లి జనార్ధన్, బుసారాజు రవి, నల్ల రాజు, చిక్కుడు నర్సింలు, ఆగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.