మండల వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
మనోహరాబాద్ అక్టోబర్22(ప్రజా గొంతుక)
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఆదివారం అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ సందర్భంగా ఆడపడుచులు మాట్లాడుతూ పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ,తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఆడపిల్లలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ అని అన్నారు.
పూలకు స్త్రీలు అందం,స్త్రీలకు పూలు కలసిన బతుకమ్మ అందం,బతుకమ్మను చూడడం మహానందం,ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు అడపడచులంతా ఆనందంతో ఉప్పొంగిపోతామన్నారు.తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆట,పాటలతో,కొలాటాలతో ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు.బతుకమ్మ వేడుకలలో భాగంగా కాళ్లకల్ గ్రామంలో జగ్గ ప్రభాకర్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ ప్రధానాకర్షణగా నిలిచింది.