ముందస్తుగా సద్దుల బతుకమ్మ వేడుకలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని యువ సంఘటన పాఠశాలలో రేపటి నుండి దసరా సెలవుల నేపథ్యంలో గురువారం పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.పాఠశాలలోని ఉపాధ్యాయురాళ్లు,విద్యార్థినీలతో కలిసి బతుకమ్మగా పేర్చి, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తున్న ఆటపాటలతో ముందస్తుగా సద్దుల బతుకమ్మ నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫరీనా మాట్లాడుతూ.. దసరా పండుగకు సెలవుల నేపథ్యంలో ముందస్తుగా సదుల బతుకమ్మ పండుగ నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.