*సమాజానికి ఉపయోగపడే మంచి గీతాలు రావాలి*
*”సక్కని చెల్లెమ్మా” పాట బ్లాక్ బస్టర్ హిట్*
*”జర్నలిస్ట్ కేపీ” నీ సన్మానించిన షాద్ నగర్ మిత్రబృందం*
*ప్రజా గొంతుక న్యూస్ :రంగా రెడ్డి జిల్లా బ్యూరో,ఆర్.ఆర్.గౌడ్*
ఎస్ఎంబి ట్యూన్స్ యూట్యూబ్ ద్వారా ఇటీవలే విడుదలైన “సక్కని చెల్లెమ్మా”
పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో
ఉర్రూతలూగిస్తుందని ఇలాంటి మంచి గీతాలు మరిన్ని రావాలని షాద్ నగర్
పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. ఈ పాటలో పాల్గొన్న నటి నటులను, దర్శకున్ని, సాంకేతిక నిపుణులను వారు ప్రత్యేకంగా అభినందించారు.
పాటకు చక్కని సాహిత్యం సంగీతం హైలైట్ గా పిలిచాయని ఈ పాటకు ఉపేందర్ దర్శకత్వం, డిఓపి చుక్క నాగరాజు ఛాయ గ్రహకుడు పని తీరు బాగా కుదిరాయని అన్నారు. ఎస్ఎంబి ట్యూన్స్ ద్వారా ఈ పాట విడుదల కావడం తమందరిని ఆనందానికి గురి చేసిందని
ఫరూక్ నగర్ మండల జడ్పిటిసి పి. వెంకటం రెడ్డి, ఎన్జీవోస్ డివిజన్ అధ్యక్షులు ఎం. వెంకటరెడ్డి, ఎంపీటీసీ భార్గవ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డి, పట్టణ నాయకులు తిరుపతి రెడ్డి, యువ న్యాయవాది గుండుబావి శ్రీనివాస్ రెడ్డి, షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టులు లట్టుపల్లి మోహన్ రెడ్డి రాఘవేందర్ గౌడ్, మిత్ర బృందం బుచ్చిరెడ్డి జై మాధవరెడ్డి,
విద్యార్థి సంఘం నాయకుడు జంగారి రవి తదితరులు అన్నారు. అన్నా చెల్లెల మధ్య ఉన్న అనురాగానికి రాఖీ పండుగ ప్రత్యేకతగా నిలిచిన తీరును చాలా చక్కగా పాటలో అభివర్ణించారని అన్నారు.
ఈ పాటను గాయకులు నర్సింహా, మమత గొప్పగా పాడారని గాయకులను కూడా ఈ సందర్భంగా అభినందించారు. ఈ గీతం కోసం ప్రత్యేకంగా కృషిచేసి సహకారం అందించిన వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ పాటలో స్థానిక జర్నలిస్టు కేపీ, చెల్లెలిగా ప్రముఖ జానపద నటిమని, ప్రముఖ కళాకారురాలు జానులిరి నటించడం అద్భుతంగా ఉందని ఇక గబ్బర్ సింగ్ ఫిల్మ్ ఫెం రైమ్సన్ రాజ్, బుల్లితెర నటుడు బల్వీందర్ సింగ్, ప్రముఖ జానపద నటుడు మల్లన్న శ్యామ్ నటన అద్భుతంగా ఉందని అన్నారు. ఇంకా నటీనటులు శిల్ప, లావణ్య తదితరులు చక్కగా అభినయం చేశారని అన్నారు. జర్నలిస్టు కేపీ తరఫున పాట యూనిట్ కు ప్రత్యేక అభినందనలు వారు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు కేపీనీ పూలదండలతొ ఘనంగా సన్మానించారు.