మడేలయ్యా గుడి నిర్మాణానికి సర్పంచ్ విరాళం
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి ఈరోజు దైవభక్తితో గుడి నిర్మాణానికి విరాళం అందించారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో రజక సంఘం నూతనంగా నిర్మిస్తున్న మడేలయ్యా గుడి నిర్మాణానికి సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి దైవభక్తితో 50 వేల రూపాయలు విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయ నిర్మాణానికి హార్దిక విరాళాలను ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ సర్పంచికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు కోఆప్షన్ సభ్యులు షబ్బీర్, ఎంపీటీసీ వేణుగోపాల్, పట్టణ అధ్యక్షుడు గంధ మల్ల నరేందర్, మండల యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, , ఉపాధ్యక్షుడు ఎండి జావిద్, గోపి, కక్కెర్ల విజయ్
బచ్చన్నపేటరజక సంఘం అధ్యక్షుడు మిన్నలాపురం చెన్నయ్య, జనగాం జిల్లా ఉపాధ్యక్షులు పిలిమెల్లి వెంకటేష్, పోసాని పెళ్లి శీను, బలరాం, రాములు, కనకయ్య, పరశురాములు, దేవరకొండ రమేష్, వెంకటయ్య, కనకయ్య, మినలాపురం సిద్ధులు, తదితరులు పాల్గొన్నారు