మృతుడి కుటుంబానికి బియ్యం సహాయం గా అందించిన బోన కొల్లూరు సర్పంచ్
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బోన కొల్లూరు గ్రామంలో మృతుడి కుటుంబానికి సర్పంచ్ మీసా ఐల్ మల్లయ్య బియ్యం అందించారు. గత కొన్ని రోజుల క్రితం మృతి చెందిన దొంతర బోయిన భూమయ్య మృతి చెందగా వారిది నిరుపేద కుటుంబం కావడంతో సర్పంచ్ మీసా ఐల్ మల్లయ్య వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని వారికి అందించడం జరిగింది. అనంతరం వారికి ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా వార్డ్ మెంబర్లు పల్లపు సిద్ధమ్మ, పల్లపు రజిత, యాదమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు