నిరుపేద ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం అందించిన కొన్నే సర్పంచ్ వెంకట్ గౌడ్……
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
గత కొన్ని సంవత్సరాల నుండి బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలకు సర్పంచ్ వెంకట్ గౌడ్ అండగా నిలుస్తున్నారు.
కొన్నే గ్రామానికి చెందిన కీ.శే యాట నర్సయ్య – యాట నర్సవ్వల కూతురు యాట శిరీష వివాహానికి హాజరైన సర్పంచ్ వెంకట్ గౌడ్ 10000(పదివేల రూపాయలు )ఆర్ధిక సహాయం అందించారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తనదృష్టికి వస్తే తప్పకుండా సహాయం చేస్తానని సర్పంచ్ ఈ సందర్బంగా అన్నారు.