కోతుల బారి నుండి పంటలను కాపాడండి రైతుల రాస్తారోకో
ప్రజా గొంతుక/ కేసముద్రం/ సెప్టెంబర్/25
ఉప్పరపల్లి గ్రామంలో కోతుల బారి నుండిపంటలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని కోరుతూరాస్తారోకో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ
కోతుల మూలంగాపంటలు నాశనం చేస్తున్నాయనిరాష్ట్ర ప్రభుత్వముఫారెస్ట్ అధికారులకుఆదేశాలిచ్చి వాటిని పట్టించి దట్టమైనఅడవులలోకి వాటిని తరలించే విధంగా చర్యలు చేపట్టాలని వారు అన్నారు.వీటి మూలంగా కూరగాయల చెట్లు కూడాలేకుండా అవుతున్నావనివ్యవసాయ బావుల వద్దకూరగాయలు పండించుకునేవాళ్ళమనికానీ నేడు కొనుగోలు చేయవలసిన
పరిస్థితులువచ్చినయని నెలకు సుమారు3000 రూపాయల చొప్పున ఖర్చు చేయవలసి వస్తుందనివారు వాపోయారు వీటన్నింటికీ ప్రధాన కారణంకోతులేనని వన్యప్రాణులు వనంలో జీవించాలని వారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తేదశలవారి పోరాటాలు చేపడతామని వారుు తెలియజేశారు.ఈనాటి రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నవారుకంచ వెంకన్న జోగు రవీందర్ కంకల కుమారస్వామి తండ సంపత్ కంచ రాములుఅంకిరెడ్డి వీరన్న కంది సుధాకర్ ఎండి సర్వర్ కంకల దేవయ్య కంకల శ్రీనివాస్ సముద్రాల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు