మృతుడి కుటుంబానికి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సహాయం
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
నిరుపేద కుటుంబానికి చెందిన మృతుడి కుటుంబానికి సర్పంచుల పోరం అధ్యక్షుడు ఆర్థిక సహాయాన్ని అందించారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందిన రాకేష్ గౌడ్ కుటుంబం నిరుపేద కుటుంబమని గొల్లపల్లి తిరుపతి ఇట్టి విషయాన్ని
బచ్చన్నపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి కి తెలియజేయడంతో వెంటనే ఆర్థిక సహాయాన్ని(10000) బిఆర్ఎస్ నాయకులతో వారి కుటుంబ సభ్యులకు అందించి , కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మాజీ ఎంపిటిసి గూడ సిద్ధారెడ్డి, నాగిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ గొల్లపల్లి ఆంజనేయ గౌడ్, గొల్లపల్లి మల్లేష్ గౌడ్ ,జూల నర్సింలు, జూలక్రిష్ణ, చింతపండు బాలకృష్ణ, జూకంటి కిష్టయ్య,
తీగల నాగేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.