*బిఆర్ఎస్ పార్టీ చట్ట వ్యతిరేక ప్రచారం*
*ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే ఎటువంటి చట్టపరమైన అనుమతి లేకుండా మండలాలలో ప్రచార రధాల ఏర్పాటు*
*పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టి వాహనాలను సీజ్ చేయాలని బిఎస్పి ప్రభుత్వo నేత దొడ్డి శ్రీనివాస్ డిమాండ్*
*ప్రజా గొంతుక: షాదునగర్ ప్రతినిధి*
షాద్ నగర్ నియోజకవర్గం లో ఎన్నికల కోడ్ కుయ్యకముందే ఎటువంటి చట్టపరమైన అనుమతులు తీసుకోకుండా మైక్ పెర్మిషన్ తీసుకోకుండా టిఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలను నియోజకవర్గంలో వివిధ మండలాలలో తిప్పుతుందని ఈ విషయంలో పోలీసులు తక్షణమే టిఆర్ఎస్ రథాలను సీజ్ చేయాలని షాద్నగర్ బిఎస్పి నేత దొడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు, పార్టీలు ప్రచారం చేసుకోవడానికి ఎన్నికల కోడ్ తర్వాతనే ప్రచార రధాలు ప్రజల్లోకి వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని, ఇది ఎన్నికల నియమాలని కానీ ఎన్నికల కోడ్ కంటే ముందు ఎటువంటి చట్టబద్ధమైన పర్మిషన్ లేకుండా వాహనాలు తిప్పుతూ సౌండ్ పొల్యూషన్ మరియు న్యూసెన్స్ ప్రజలు క్రియేట్ చేస్తున్నారని అందుకోసం తక్షణమే టిఆర్ఎస్ ప్రచార రథాలను పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాలని డిమాండ్ చేశారు, చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రాన్ని ప్రజలకు తెలియజేయవలసిన అవసరం పోలీసుల పైన ఉందని గుర్తు చేశారు.