*ఏడు వందల ఏళ్ల చరిత్ర దర్గా హజ్రత్ పీర్ గయాబ్ షా
*షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కేపీ, ఖాదర్ గోరి
*ఎలికట్టలో హజ్రత్ పీర్ గయాబ్ షా 174వ ఉర్సు ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ*
*పోస్టర్ ఆవిష్కరణకు హాజరైన కాంగ్రెస్ నేత ఖాదర్ గోరి*
*నవంబర్ 2న గంధోత్సవం ప్రారంభం*
*ఉర్సు ఉత్సవాలకు ఖాదర్ గోరి రూ.5000 వితరణ*
ప్రజా గొంతుక : రంగారెడ్డి జిల్లా బ్యూరో
కొలిచిన భక్తులకు కొంగుబంగారంలా మారి భక్తులు కోరిన కోరికలను నెరవేర్చుతూ ఆధ్యాత్మిక చింతనతో సర్వ మానవాళికి మోక్షం ప్రసాదించిన హజరత్ సయ్యద్ అబ్బాస్ షా ఖాద్రీ చిస్తీ ఉర్ఫియాత్ పీర్ గయాబ్ షా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ మహ్మద్ ఖాజాపాషా (కేపీ), కృష్ణ మహేష్ ప్రజాసేన ఆల్ ఇండియా వ్యవస్థాపకులు ఎండి ఖాదర్ గోరి పిలుపునిచ్చారు. 174వ ఉర్సు షరీఫ్ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను బుధవారం ఉదయం దర్గా నిర్వాహకుడు మొహమ్మద్ అన్వర్ పాషా ఖాద్రీ దర్గా సజ్జదే నశీన్ ఆధ్వర్యంలో పాస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ ఆవిష్కరణ చేసిన వారిలో కాంగ్రెస్ నేత ఖాదర్ గోరి, డాక్టర్ ఖాజాపాషా మరియు కీర్తిశేషులు బుర్హాన్ సోదరుడు అబ్బాస్ ఖాద్రీ, ఖాదర్ గోరి మాజీ డైరెక్టర్ సి.చంద్రయ్య, జహంగీర్, ఖదీర్, సల్మాన్, అఖిల్ బాబా సమీర్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఖాదర్ గోరి, జర్నలిస్ట్ కేపీ మాట్లాడుతూ 700 ఏళ్ల ఆధ్యాత్మిక చరిత్ర గల ఈ దర్గాలో ఎన్నో మహిమలు ఉన్నాయని పేర్కొన్నారు. పూర్వం 700 ఏళ్ల క్రితం హజ్రత్ ఎందరో భక్తులకు దర్శనం ఇచ్చి వారూ కోరుకున్న వరాలను ప్రసాదించిన చరిత్ర ఉందని పేర్కొన్నారు. నేటికి దర్గాలో మొక్కులు చెల్లించుకుంటూ భక్తులు పెద్ద ఎత్తున దర్శనాల కోసం రావడం అద్వితీయమని అన్నారు. కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారమైన ఈ దర్గా అభివృద్ధికి గ్రామస్తులతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా ఉన్న ఈ దర్గా అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.
*నవంబర్ 2న గంధోత్సవం ప్రారంభం*
దర్గా నిర్వాహకుడు మొహమ్మద్ అన్వర్ పాషా ఖాద్రీ దర్గా సజ్జదే నశీన్ వెల్లడి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గంలోని ఫరూక్ నగర్ మండలము ఎలికట్టలో వెలిసిన హజరత్ సయ్యద్ అబ్బాషా ఖాద్రీ చిస్తీ ఉర్ఫియాత్ పీర్ గయాబ్ షా ఉర్సు ఉత్సవాలు నవంబర్ 2న గంధోత్సవం ప్రారంభం కానునట్లు దర్గా నిర్వాహకుడు మొహమ్మద్ అన్వర్ పాషా ఖాద్రీ దర్గా సజ్జదే నశీన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 3న దీపారాధన నవంబరు 4న ఫాతేహా మూడు రోజులు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఉర్సు కార్యక్రమాలకు ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఎంపీపీ, జడ్పిటిసి తదితరులు హాజరవుతారని వారు పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయగలరని ఆయన మీడియా ద్వారా పేర్కొన్నారు.
*ఉర్సు ఉత్సవాలలో భాగస్వాములు కావాలి*
పీర్ గయాబ్ షా ఉర్సు ఉత్సవాలలో భక్తులు ప్రజలు భాగస్వాములు కావాలని నిర్వాహకుడు అన్వర్ పిలుపునిచ్చారు. దర్గా ఉత్సవాలకు సంబంధించి ఆయా కార్యక్రమాల్లో తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందించి దర్గా అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ఇతర భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దాతలను ఆయన కోరారు. ఫోన్ పే, గూగుల్ పే 9948049183 ద్వారా తమ పేరు నమోదు చేసుకుని తమకు తోచిన విరాళాన్ని దర్గా కోసం అందజేయాల్సిందిగా ఆయన అభ్యర్థించారు