మురుగు నీటిని తొలగించాలి
ప్రజాగొంతుక ప్రతినిధి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
నిడమనూరు మండలంలోని ముకుందాపురం గ్రామంలో వీధులన్నీ వర్షపు నీటితో మురికి కూపాలుగా తయారయ్యాయని సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మలికంటి చంద్రశేఖర్ ఆరోపించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి
వీధులన్నీ బుర దమయం అయ్యాయని, ప్రజలందరూ ఆ మురికినీటికుండానే వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఎల్లప్పుడు నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు బెడదా ఎక్కువై ప్రజలు అనారోగ్య పాలు అయ్యే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.
నడిరోడ్డుపై నీరు నిల్వ ఉందని, ప్రజలు చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామ సర్పంచికి, పంచాయతీ అధికారులకు, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని వారన్నారు వర్షాకాలం వస్తున్న కారణంగా విష జ్వరాలు విజృంభించకుండా, దోమలకు, ఈగల కు నిలయమైన, మరుగు నీటి నిల్వ లను, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని,
ప్రజల అనారోగ్య బారిన పడకుండా కాపాడాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.ఆయన వెంట గోలి మోహన్, రొయ్య శ్రీను, బొజ్జ మధు, సలికంటి విజయ్, ఆవుల కృష్ణతదితరులు పాల్గొన్నారు