బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన షేక్ మొహమ్మద్ మన్సూర్ అలీ
ప్రజాగొంతుక న్యూస్/హుజూర్ నగర్
హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి 2019 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్యులకు ఇచ్చిన బహిరంగ హామీలలో ఏ ఒక్కటి నేటి వరకు నెరవేర్చకపోవడం,పట్టించుకోకపోవడంతో పాటు ఎమ్మెల్యే గెలుపులో కృషిచేసిన రూరల్ మెడికల్ ప్రాక్టీషియన్స్ అసోసియేషన్ (ఆర్ఎంపి -ఏ) సంఘం జిల్లా డివిజన్ మండల నాయకులకు కనీస పలకరింపు మాట్లాడడం లేకపోవడంతో గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో చెప్పుకోలేని విధంగా బాధపడుతూ తీవ్ర మనస్తాపం చెంది ఆదివారం టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు షేక్ మొహమ్మద్ మన్సూర్ అలీ
బహిరంగ లేఖ విడుదల చేసి అట్టి ప్రతిని జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ కు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి పంపారు.