కట్టుకున్న భార్యనే ‘కాటేసి ‘ కడతేర్చిన వైనం – కొచ్చేర ప్రవీణ్ హత్య కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు!
ప్రజా గొంతుక పెద్దపల్లి :
గోదావరిఖని పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా బిల్డర్ గా అతి తక్కువ సమయంలో ఎదిగిన కొప్పెర ప్రవీణ్ మృతి కేసులో కట్టుకున్న భార్య మరో ఐదుగురు నిందితులతో కలిసి హతమార్చిన సంఘటన లో ఆరుగురు నిందితులను ఒకరోజు తిరక్కుండానే అరెస్టు చేసిన గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు చట్టం ముందు భార్య ముసుగును తొలగించి దోషిగా నిలబెట్టడం జరిగింది
గోదావరిఖని పట్టణానికి చెందిన కొప్పెర ప్రవీణ్ అనునతడు విలేకరిగా తన ప్రస్థానాన్ని
ప్రారంభించి వివిధ దినపత్రికలలో కొంతకాలం పనిచేసి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం లోకి
అడుగు పెట్టినాడు అతడు క్రమంగా వ్యాపారంలో అభివృద్ధి చెందుతూ బిల్డర్ గా కూడా ఎదుగుతూ..
ఉన్నాడు అతడికి లలిత అనే ఆమెతో సుమారు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగినది వారికి
ముగ్గురు సంతానం కలరు అందులో పెద్ద కూతురు పదవ తరగతి చదువుతూ గోదావరిఖనిలోనే
ఉంటూ ఉండగా మిగతా ఇద్దరు పిల్లలు వరంగల్ మాంటిస్సోరి స్కూల్లో చదువుతూ అక్కడే వసతి
గృహంలో ఉంటున్నారు.
సంఘటన నేపథ్యం
వ్యాపార రీత్యా ప్రవీణ్ ఇతర ప్రాంతాలకు మరియు ఇంటికి దూరంగా పలు సందర్భాల్లో వెళుతున్న క్రమంలో గోదావరిఖని పట్టణానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది అప్పటివరకు సజావుగా అన్యోన్యంగా జరిగిన కొప్పెర ప్రవీణ్ అతని భార్య లలిత సంసార జీవితంలో కలకలం మొదలయ్యింది ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి తరచుగా ఇంటిలో గొడవలు జరగడం మొదలయ్యింది దీని నుంచి ఉపశమనం పొందుటకు ప్రవీణ్ మద్యానికి బానిసై తరచుగా అధిక మొత్తంలో మద్యం సేవించి ఇంటికి రావడం మద్యం మత్తులో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం ఇది గత కొంతకాలంగా సర్వసాధారణం అయిపోయింది. ఈ పరిణామాలతో విసిగిపోయిన కొప్పెర ప్రవీణ్ భార్య లలిత ఈ సమస్య నుండి దూరం కావాలని ఆలోచన ప్రారంభించింది ఈ క్రమంలో కొప్పెర ప్రవీణ్ దగ్గర సెంట్రింగ్ వర్కర్ గా పనిచేస్తున్న రామగుండానికి చెందిన మచ్చ సురేష్ తరచుగా కొప్పెర ప్రవీణ్ ఇంటిని సందర్శించేవాడు. సురేష్ తమ వద్దనే పనిచేస్తుండడం ఇంటికి తరచుగా వస్తూ ఉండడంతో కొచ్చర ప్రవీణ్ భార్య లలిత కూడా అతనితో తరచుగా మాట్లాడుతూ తమ ఇంటి సమస్యలు కూడా ఏ కరువు పెట్టుకునేది అంతేకాకుండా దీని నుండి తనకు విముక్తి కావాలని ఏ విధంగానైనా ఈ సమస్య నుంచి బయట పడడానికి, తనకు సహాయం చేయాలని మచ్చ సురేష్ ని కోరింది అందుకు మచ్చ సురేష్ అంగీకరించి, కొచ్చర ప్రవీణ్ ను అంతం చేయుటకు ఇద్దరు కలిసి నిర్ణయించినారు. కానీ మచ్చ. సురేష్ ఈ సంఘటనతో తన కుటుంబం ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని తెలపడంతో తన వద్ద ఉన్న ఒక ఫ్లాటును మచ్చ సురేష్ కు ఇవ్వడానికి ప్రవీణ్ భార్య లలిత సిద్ధపడింది దానితో ఇద్దరు కలిసి ప్రవీణ్ ను ఎవరికి అనుమానం రాకుండా చంపి సహజ మరణంగా అందరినీ మభ్య పెట్టేలా ప్రణాళికను తయారు చేసుకున్నారు. వారి ప్రణాళికలో కొచ్చెర ప్రవీణ్ ను ఊపిరాడకుండా చేసి చంపాలని ఒకవేళ అందులో అతను చనిపోకపోతే పాముతో కాటేయించి చంపాలని ప్రణాళికను రూపొందించుకున్నారు ఆ విధంగా అయితే అది హత్య అనే విషయం ఎవరు గమనించరని సహజమరణంగా చిత్రీకరించుటకు సులువుగా ఉంటుందని భావించినారు.కొచ్చర లలిత మరియు మచ్చ సురేష్ ఇద్దరు కలిసి కొచ్చేరా ప్రవీణ్ ను అంతమొందించుటకు నిర్ణయించుకున్న తర్వాత మచ్చ సురేష్ తన మిత్రుడైన ఇందారపు సతీష్ ను సంప్రదించి తనకు సహాయం చేయవలసిందిగా కోరినాడు అందుకు తాను కొంత ప్రతిఫలం కూడా చెల్లించుకుంటానని తెలుపగా ఇందారపు సతీష్ అందుకు అంగీకరించినాడు ఆ తర్వాత మచ్చ సురేష్ తన మిత్రుడైన మందమర్రి కి చెందిన మాస శ్రీనివాసును సంప్రదించి తనకు ఒక పాములు పట్టే వ్యక్తి కావాలని ఒక పాము కూడా కావాలని తెలుపుతూ మాస శ్రీనివాసు సహకారాన్ని కూడా కోరినాడు. అందుకు శ్రీనివాస్ అంగీకరించి తనకు పరిచయం ఉన్న భీమ గణేష్ ద్వారా మందమర్రిలో సింగరేణి కాలరీస్ లో ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్న పాములు పట్టే అలవాటున్న నన్నపురాజు చంద్రశేఖర్ ను సంప్రదించినారు. తాము ఒక వ్యక్తిని చంపుటకు పాము అవసరం ఉన్నదని పాము తీసుకొని తమతో రావాలని అందుకు కొంత మొత్తం చెల్లిస్తామని చెప్పగా నన్నపరాజు చంద్రశేఖర్ కూడా అందుకు అంగీకరించినాడు. సంఘటనకు రెండు రోజుల ముందు, మచ్చ సురేష్ కొచ్చెర ప్రవీణ్ భార్య లలిత దగ్గరికి వెళ్లి తన ఖర్చులకు కొంత డబ్బు కావాలని కోరగా తన వద్ద ఉన్న (34) గ్రాముల బంగారు గొలుసును సురేషుకు ఇచ్చి, దానిని అమ్మి ఆ సొమ్మును ఖర్చులకు ఉపయోగించుకొమ్మని చెప్పింది. ఈ క్రమంలో తేదీ 9 -10-23 రోజున చంద్రశేఖర్ ఫోను ద్వారా మచ్చ సురేష్ కు పాము అందుబాటులో ఉన్నదని తెలుపగా ఆరోజే కోచ్చేరా ప్రవీణ్ ను అంతమొందించుటకు పథకం వేసుకున్నారు ఈ క్రమంలో అందరూ రామగుండంలో కలుసుకొని మద్యం సేవిస్తూ ప్రవీణ్ భార్య లలితతో ప్రవీణ్ కదలికల గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అదే రోజు రాత్రి 11 గంటలకు కొచ్చెర ప్రవీణ్ మద్యం సేవించి ఇంటికి రాగా బెడ్ రూమ్ లో అతను నిద్రకు ఉపక్రమించిన తర్వాత ప్రవీణ్ భార్య లలిత ఆ విషయాన్ని ఫోన్ ద్వారా మచ్చ సురేష్ కి తెలియపరచినది వెంటనే మచ్చ సురేష్ మరియు అతని అనుచరులు రెండు మోటార్ సైకిల్ పై బయలుదేరి మార్కండేయ కాలనీలో ఉన్న కొచ్చెర ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు వారి రాక కోసం ఎదురుచూస్తున్న ప్రవీణ్ భార్య లలిత ఇంటిముందు ప్రధాన ద్వారాలు తెరిచి ఉంచి వారిని ఇంటి లోపలికి ఆహ్వానించినది అంతేకాకుండా పడకగదిలో నిద్రిస్తున్న ప్రవీణ్ ను చూపించి తాను మరొక గది లో కూర్చుని ఎదురు చూడ సాగింది సురేష్ తన అనుచరులతో పడకగదిలో నిద్రిస్తున్న ప్రవీణ్ వద్దకు వెళ్లి మచ్చ సురేష్ చెద్దరుతో కొచ్చర ప్రవీణ్ ను ముక్కు మరియు నోటిపై ఊపిరాడకుండా అదిమి పట్టుకోగా అతని అనుచరులు ఇందారపు సతీష్ భీమ గణేష్ మాస శ్రీనివాసులు కాళ్లు చేతులు గట్టిగా పట్టుకొని మచ్చ సురేష్ కు సహకరించారు ఒకవేళ అతను ఆ విధంగా చనిపోకపోతే పాముకాటుతో ఆయన కచ్చితంగా చనిపోతాడని ముందే నిర్ణయించుకున్న మచ్చ సురేష్ తన మిత్రుడు నన్నపరాజు చంద్రశేఖర్ సహాయంతో పాముతో కాటేయించినాడు తర్వాత కొన్ని నిమిషాలకు ప్రవీణ్ ప్రతిఘటించడం ఆగిపోయిన తర్వాత ప్రవీణ్ చనిపోయినాడు అని నిర్ధారించుకున్న తర్వాత మచ్చ సురేష్ మరియు అతని అనుచరులు అక్కడ నుండి నిష్క్రమించినారు మచ్చ సురేష్ మరియు ఇందిరేపు సతీష్ రామగుండంకు వెళ్లిపోగా నన్నపరాజు చంద్రశేఖర్ భీమ గణేష్ మాస శ్రీనివాసులు మందమర్రి కి వెళ్ళిపోయినారు ఇలా వెళ్లే క్రమంలో గోదావరి నది దాటిన తర్వాత తమ వెంట తెచ్చిన పామును అడవిలోకి వదిలి వెళ్ళిపోయినారు.
ఉదయం 6 గంటలకు ప్రవీణ్ భార్య లలిత ప్రవీణ్ కోసం ఇంటికి వచ్చిన అతని మిత్రుడికి నిద్రిస్తున్నాడని చెప్పి ఇంటిలోకి వెళ్లి నిద్ర లేపుతున్నట్టుగా నటించింది అతను లేవకపోయేసరికి ఆ విషయాన్ని అతని మిత్రునికి తెలియజేసి ప్రవీణ్ ను లేపడానికి సహకరించవలసిందిగా కోరింది. అతను లోనికి వచ్చి ప్రవీణ లో ఎటువంటి కదలికలు లేవని గ్రహించి వెళ్లిపోయినాడు. ప్రవీణ్ భార్య లలిత చుట్టుపక్కల వారికి మరియు తన కుటుంబ సభ్యులకు ఏమీ తెలియనట్టు సమాచారం అందించి ప్రవీణ్ నిద్ర నుండి లేవడం లేదని అతనికి గుండెనొప్పి వచ్చినట్టుగా ఉందని సమాచారం అందించగా చుట్టుపక్కల వారు మరియు కుటుంబ సభ్యులు చేరుకొని.గమనించగా ప్రవీణ్ లో ఎటువంటి కదలికలు లేవు. ఆయన వారు ఆశతో ప్రవీణ్ ను ఆసుపత్రికి తరలించగా డాక్టర్ అప్పటికే చనిపోయినట్టుగా తెలిపినారు ప్రవీణ్ గుండె నొప్పితో చనిపోయినాడు అని అందరికీ చెబుతూ ప్రవీణ్ మృదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లి ఫ్రీజర్ లో అంతిమ సంస్కారాల కోసం మృతదేహాన్ని ఉంచడం జరిగింది
సంఘటన బయటకు తీసిన వైనం
తన కుమారుడి అకాల మరణ వార్తను తెలుసుకున్న మృతుడి కొచ్చర ప్రవీణ్ తల్లి మరియమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు గోదావరిఖనికి రావడం జరిగింది మృతదేహాన్ని చూసిన తర్వాత ప్రవీణ్ తల్లి మరియమ్మకి అనుమానం కలిగి మృతుడు ది సహజ మరణం అయి ఉండదని, మరణం పై అనుమానం కలదని పోలీసులు దృష్టికి తీసుకుని రాగా, ఆ విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ వన్ టౌన్ ప్రమోద్ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మృతుడి భార్య లలిత మరియు కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించడం జరిగింది అతడు ప్రాథమికంగా చేసిన విచారణలో మృతుడు మరణం సహజమైనది కాదని అసహజంగా మరణించి నాడని ఒక నిర్ధారణకు వచ్చి మృతుడి భార్యను విచారించడం జరిగింది
వెంటనే హత్య కేసు కింద కేసు నమోదు చేసుకున్న గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది
మృతుడి భార్య లలితను అదుపులోకి తీసుకొని విచారించగా, పోలీసుల విచారణలో మృతుడి భార్య లలిత తన నేరాన్ని పూర్తిగా అంగీకరిస్తూ తనకు సహకరించిన మచ్చ సురేష్ మరియు అతని సన్నిహితుల గురించి తెలపడం జరిగింది.
వెంటనే గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఐదు బృందాలుగా నిందితుల కోసం గాలించగా నేరం చేసిన తర్వాత నిందితులు తలోదిక్కుగా పారిపోయి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. వారి కదలికపై నిఘా వేసిన పోలీసు ప్రత్యేక బృందాలు వారిని పట్టుకుని
విచారించగా జరిగిన సంఘటనను క్షుణ్ణంగా వివరించి తమ నేరాన్ని అంగీకరించడం జరిగింది.
నిందితుల వివరాలు:
1. కొచ్చెర లలిత గోదావరిఖని. 2. మచ్చ సురేష్ s/o భూమయ్య, రామగుండం 3.ఇందారపు సతీష్ రామగుండం
4. నన్నపరాజు చంద్రశేఖర్ మందమర్రి
5. భీమ గణేష్ మందమర్రి
6. మాసు శ్రీనివాస్ మందమర్రి.
స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు:
1. నేరంలో ఉపయోగించిన A3 బజాజ్ ప్లాటిన మోటార్ సైకిల్ B.No. AP-15-AD-3270, 2. నేరంలో ఉపయోగించిన 44 టీవీఎస్ స్పోర్ట్ B.No. AP-01-E-9582, 3. నేరంలో ఉపయోగించిన A6 టీవీఎస్ విక్టర్ B.No. AP-15-BC-7818,
4. నేరం చేసే సమయంలో నిందితులు ఉపయోగించిన ఆరు మొబైల్ ఫోనులు, 5. 34 గ్రాముల బంగారు చైను. అందుబాటులో ఉన్నాయని. శుక్రవారం ప్రెస్ మీట్ లో
వైభవ్ గైక్వాడ్, ఐపిఎస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ తెలియపరిచినారు.