మెదక్ జిల్లా ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ ఆద్వర్యంలో జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎస్పి “
మెదక్ ప్రజా గొంతుక న్యూస్
జాతీయ ఐక్యత దినోత్సవం” కార్యక్రమాన్ని జిల్లా అదనపు అడ్మిన్ ఎస్.పి .ఎస్.మహేందర్ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ నిర్వహించి, మానవీయమూర్తి సర్దార్ వల్లభాయి పటేల్ కి ఘన నివాళి అర్పించి పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించినారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ మాట్లాడుతూ… సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది పోరాటమే ఊపిరిగా సాగిన ప్రస్థానం దేశ సమగ్రత కోసం శ్రమించిన ధీరత్వం, అప్పుడే స్వతంత్రం వచ్చిన పసిగుడ్డు లాంటి దేశాన్ని ఒంటి చేత్తో ఏకం చేసి, దేశ విభజనతో జాతి గుండెకు గాయమైన వందలాది సంస్థలను ఒక్కటి చేసిన మహనీయుడికి ఘననివాళి అర్పించడం మహా బాగ్యం అని అన్నారు. యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబంలా జీవిస్తూ జాతి సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళి అవుతుందని కొనియాడారు. జిల్లా పరిదిలో అన్ని పోలీస్ స్టేషన్లలో సర్దార్ వల్లభాయి పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని ఏక్తా దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి మానవీయ మూర్తి సర్దార్ వల్లభాయి పటేల్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డి.ఎస్.పి .ఫణీంద్ర , సైబర్ క్రైమ్ డి.ఎస్.పి..సుభాష్ చంద్రభోస్ , మెదక్ పట్టణ సి.ఐ వెంకట్, మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్.బి సి.ఐ .సందీప్ రెడ్డి గారు, డి.సి.ఆర్బి సిఐ .ప్రకాష్ గౌ .దిలీప్, ఆర్.ఐ.లు.నాగేశ్వర్ రావ్.అచ్యుత రావ్ , మెదక్ రూరల్ ఎస్.ఐ .అమర్ , హవేలిఘనాపూర్ ఎస్.ఐ .ఆనంద్ , మెదక్ పట్టణ ఎస్.ఐ.పోచయ్య, ఆర్.ఎస్.ఐ లు శ్రీ.నరేష్ గారి, .భవానీకుమార్ , .సుభాష్, .మహిపాల్ , మరియు ఏఓ .లక్ష్మి లావణ్య,లతా ,వలీయ .అనురాధ ,మినిస్టీరియల్ స్టాఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.