కృష్ణా జలాలతో శివాలయంలో ప్రత్యేక పూజలు
-….బొంపల్లి సర్పంచ్ కోళ్ల సురేష్,బిఆర్ఎస్ నాయకులు
ప్రజా గొంతుక న్యూస్ దోమ ప్రతినిధి
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆదేశానుసారం దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో మంగళవారం కృష్ణ జలాల కలశంతో శివాలయంలో జలాభిషేకం చేసినా సర్పంచ్ కోళ్ల సురేష్, బి ఆర్ ఎస్ నాయకులు నిర్వచించారు.
ఈ సందర్భంగా మంగళవారం వారు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతి త్వరలోనే కృష్ణా జలాలు పరిగి నియోజకవర్గ బీడు భూములను తడవనున్నాయని,మన బొంపల్లి లో కూడా సాగునీటి కోసం త్వరలోనే కాలువల ద్వారా పంటలకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది అని, రైతు ఆత్మహత్యలు ఇక కనబడవు అని, వారు సంతోషము వ్యక్తం పరిచారు.పాలమూరు ఎత్తిపోతల పథకం నీ నిలుపుదల కు ప్రతిపక్షాలు ఎన్నో ఆటంకాలను కలిగించినా,
మళ్ళీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని అధిగమించి ప్రాజెక్టు ను ప్రారంభించడాని కొనియాడారు, మూడో సారి మన రైతు పక్షపతి కెసిఆర్ ను,మన మహేష్ రెడ్డి ని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ప్రజలకు తెలియజేశాడు , ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఫీ,ఎంపీటీసీ రాములు, బొంపల్లి గ్రామ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎక్స్ ఎంపిటిసి అనిత సంగన్న, పంచాయతి సెక్రటరీ అలీం మరియు గ్రామ బిఆర్ఎస్ నాయకులు ఆర్ నర్సింహా రెడ్డి,షేర్ఖాన్,బాబర్, రమేష్,బంక చిన్నయ్య,వెన్నచేటి ఎల్లయ్య, పవన్ యాదవ్, డి వెంకటయ్య, వై వెంకటయ్య,ముజీబ్ తదితరులు పాల్గొన్నారు…