క్రీడాకారుడు రవీందర్ రెడ్డిని సన్మానించిన విద్యుత్ శాఖ మంత్రి
ప్రజా గొంతుక న్యూస్/ సూర్యాపేట జిల్లా
హాకీ దిగ్గజం జ్ఞాన్ చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా సూర్యాపేట జిల్లా స్పోర్ట్స్ అధారిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన చలో మైదాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ జాతీయ క్రీడాకారులను సత్కరించారు
అందులో భాగంగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన జాతీయ కబడ్డీ క్రీడాకారుడు దేవరం రవీందర్ రెడ్డిని సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్, సూర్యాపేట డిఎస్పి తదితరులు పాల్గొన్నారు