పాపన్నపేట మండల వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
పాపన్నపెట్ ప్రజా గొంతుక న్యూస్
పాపన్నపెట్ మండల పరిధిలోని నార్పింగి శ్రీ సాయి స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.చిన్నారులు శ్రీకృష్ణుని, గోపికల వేషధారణలు ధరించి ఊయలలు ఊగుతూ,ఉట్టి కొడుతూ,
నృత్యాలు చేస్తూ అలరించారు.చిన్న పిల్లల ఆటపాటలు,వారు చేసిన అల్లరి అందరిని ఆకర్షించాయి.ఈ సందర్బంగా చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రతీ పండగకు సబందించి వాటి ప్రాముఖ్యత పిల్లలకు తెలిసేలా ఇలా కల్చరల్ ప్రోగ్రామ్ లు నిర్వహించడం సంతోషం గా ఉందని
ఇలాంటి కార్యక్రమాల వలన పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలుస్తాయి అన్నారు.పాఠశాల కరస్పాండెంట్ మహష్ మాట్లాడుతూ ఇప్పుడున్న పిల్లలకు మన పండగల గురించి వాటి ప్రాముఖ్యత తెలియజేయాలని, విద్యతో పాటు ఆటలు,పాటలు అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాలయాజమాన్యం భాస్కర్,నరేష్,మహష్,శివ, ఉపాధ్యాయులు వినోద్,శ్రావణి,శ్రీలత,రాజ్యలక్ష్మీ,సీందూర,రాణి,పూజిత,నవ్య,రచన,సభ తదితరులు పాల్గొన్నారు.