పిడిఎస్ బియ్యం పట్టుకున్న ఎస్సై రమేష్ బాబు
ప్రజా గొంతుక/ దంతాలపల్లి/ అక్టోబర్/2
మండల లోని తూర్పు తండాలో సోమవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు
తూర్పు తండాలో పిడిఎస్ బియ్యం టి ఎస్ 08 యు జె 2668 గల వాహనంలో కలెక్షన్ చేసుకుని వెళుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. పట్టుబడ్డవారిని విచారించగా కొడకండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, బొమ్మల రామవరం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు , దంతాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మొత్తం ఏడుగురు వ్యక్తులు, దీరావత్ నవీన్, ధరావత్ సురేష్, ధీరావత్ రాజేష్, ధరావత్ వెంకటేష్, ధీరావత్ సురేష్, సందు ఐలయ్య, గుగులోతు సంతు లుగా గుర్తించి,
వారు ప్రజల నుండి తక్కువ దరకు బియ్యం కొనుక్కుని వెళ్తుండగా 30 క్వింటాలు బియ్యాన్ని పట్టుకోవడం జరిగిందని అన్నారు.వాటి విలువ సుమారు 60 వేల రూపాయలుగా ఉంటుందని, బియ్యం తరలిస్తున్న వాహనంతో పాటు టి ఎస్ 27 డి 5380 గల పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బి తార చంద్, హెడ్ కానిస్టేబుల్లు ప్రకాష్ రెడ్డి, జెన్నయ్య యాకయ్య లు ఉన్నారు.