నకిలీ మద్యం అరికట్టండిలా – అందుబాటులోకి వెరిట్ యాప్…
-ఆర్. మహిపాల్ రెడ్డి ఎక్సైజ్ అధికారి
ప్రజా గొంతుక పెద్దపల్లి :
నకిలీ మద్యాన్ని అరికట్టడానికి ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వెరిట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాప్ ఆధారంగా ఫోన్ ద్వారా మద్యం సీసాపై ఉన్న బార్ కోడ్ ను స్కాన్ చేస్తే అది ఎక్కడ తయారైంది, తయారీ కోడ్, తయారైన తేదీ, డిపో లొకేషన్, అమ్మకం జరిగిన ప్రాంతం, మద్యం దుకాణం పేరు, ధర… తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు. బార్ కోడ్ స్కాన్ ద్వారా వివరాలు రాకపోయిన, మద్యం సీసాపై బార్ కోడ్ లేకపోయిన టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.
అక్రమ మద్యం నిల్వలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబరు “1800-425-2523”
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి, నకిలీ మద్యం మరియు ఇతర రాష్ట్రాల మద్యం నిల్వ చేసే ఆస్కారం ఉంది. వీటిని నియంత్రించేందుకు ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నంబరుకు “1800- 425-2523” అందుబాటులోకి తెచ్చింది. ఎక్సైజ్ కు సంబంధించిన నేరాల సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఆర్. మహిపాల్ రెడ్డి
జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి, తెలియజేశారు.